దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు చనిపోయాడు. ఎంతోమంది అమాయకుల ప్రాణాలు బలిగొన్న బాంబు పేలుడు కేసులో నిందితుడు సయ్యద్ మఖ్బూల్ మృతి చెందాడు.
ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన మఖ్బూల్ దేశవ్యాప్తంగా పలు బాంబుదాడుల్లో పాల్గొన్నట్టు ఎన్ఐఏ నిర్ధారించింది. 2013 ఫిబ్రవరి 21న సాయంత్రం 6:45 గంటలకు జరిగిన దిల్ సుఖ్ నగర్ పేలుళ్లలో 17 మంది ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఎన్ఐఏ మూడేళ్ల పాటు విచారణ జరిపి 157 మంది సాక్ష్యాలను నమోదు చేసింది. ఈ కేసులో అసదుల్లా అక్తర్, వకాస్, తెహసీన్, అక్తర్, యాసిన్ బత్కల్, ఎజాజ్ షేక్, మఖ్బూల్ దోషులుగా తేలింది. వీరిలో ప్రధాన నిందితైన యాసిన్ భత్కల్ పాకిస్థాన్ లో తలదాచుకోగా.. మిగిలిన నిందితులు చర్లపల్లి జైలులో ఉన్నారు. వీరిలో మఖ్బూల్ తాజాగా అనారోగ్యంతో చనిపోయాడు. మహారాష్ట్రకుచెందిన మఖ్బూల్ బాంబులు తయారు చేసేవాడు.