పలాస మండలం లక్ష్మీపురం టోల్‌గేట్ దగ్గర ప్రమాదం జరిగింది. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న స్థానికులు ఆమెను పలాస హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ విషయంలో తెర మీదకి వచ్చిన దివ్వల మాధురికి యాక్సిడెంట్ అయింది. దువ్వాడ శ్రీనివాస్ తనకు బాకీ ఉన్నారని, అగ్రిమెంట్ పేపర్ రాసిచ్చారని ఆమె ఆరోపించిన విషయం తెలిసిందే. టెక్కలిలోని దువ్వాడ శ్రీనివాస్ ఇంటిపై తనకు హక్కు ఉందని, డాక్యుమెంటరీ ప్రూఫ్ కూడా ఉందని ఆమె వెల్లడించారు.
మరోవైపు, శ్రీనివాస్ సతీమణి వాణి మాత్రం మాధురికి పూర్తిగా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ ప్రవర్తనతోనే కుటుంబంలో విభేదాలు వచ్చాయని దువ్వాడ వాణి తండ్రి రాఘవరావు చెబుతున్నారు.
భార్య, కుమార్తెలను వదిలేసి మరో మహిళతో ఉన్నాడని ఆరోపించారు. 60 ఏళ్ల వయసులో దువ్వాడ ఇలా చేయడం సరికాదని ఆయన అన్నారు. ఇప్పటికే దువ్వాడ శ్రీనివాస్, అతని సోదరుడిపై వాణి కేసు నమోదు చేయించింది.
ఓవైపు ఈ వివాదం కొనసాగుతుండగా.. మాధురి కారు ప్రమాదానికి గురైంది. శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆగి ఉన్న కారును మాధురి కారు ఢీకొట్టిందని స్థానికులు చెబుతున్నారు. పలాస మండలం లక్ష్మీపురం టోల్‌గేట్ దగ్గర ప్రమాదం జరిగింది. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న స్థానికులు ఆమెను పలాస హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
అయితే, డాక్టర్లతో మాట్లాడిన మాధురి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు జరిగింది యాక్సిడెంట్ కాదని ఆమె తెలిపారు. వాణి చేస్తున్న ఆరోపణలు భరించలేక.. సూసైడ్ చేసుకోవాలని అనుకున్నట్లు తెలిపారు. కావాలనే కారును ఢీకొట్టానని వెల్లడించారు. డాక్టర్లు చికిత్స చేయవద్దని ఆమె అన్నారు. తనపై,పిల్లలపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ తట్టుకోలేక పోతున్నానని మాధురి ఆవేదన వ్యక్తం చేశారు.
video కోసం క్లిక్ చేయండి.