సాధారణంగా చాలామందికి శరీరం అంత వెంట్రుకలు ఉంటాయి. కొంతమందికి కాలి బొటనవేలుపై కూడా అనేక వెంట్రుకలు ఉంటాయి. మీకు వెంట్రుకలు పెరగడానికి గుండెకు దగ్గర సంబంధం
న్యూస్ లైన్ డెస్క్:సాధారణంగా చాలామందికి శరీరం అంత వెంట్రుకలు ఉంటాయి. కొంతమందికి కాలి బొటనవేలుపై కూడా అనేక వెంట్రుకలు ఉంటాయి. మీకు వెంట్రుకలు పెరగడానికి గుండెకు దగ్గర సంబంధం ఉంటుందట. దానికి దీనికి రిలేషన్ ఏంటని మీరు ఆలోచిస్తున్నారా.. అదే ఇప్పుడు తెలుసుకుందాం.. ముఖ్యంగా శరీరంపై వెంట్రుకలు ఎక్కువగా పెరుగుతున్నాయి అంటే తగిన పోషక పదార్థాలు అందుతున్నాయని అర్థం చేసుకోవాలి. మనం తీసుకునే ఆహారంలోని పోషకాలు రక్తంలో చేరి అవి వెంట్రుకలను తాకడం వల్ల పెరుగుతాయి.
మన శరీరంలో ఎక్కడైతే ఎక్కువ వెంట్రుకలు మొలుస్తాయో అక్కడ రక్త సరఫరా ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి. కొందరికి కాలి బొటనవేలుపై కూడా వెంట్రుకలు ఉంటాయి. కొందరికి అసలు పెరగవు. అయితే ఎక్కువ పెరిగితే రక్తం సమృద్ధిగా వస్తుందని, తక్కువ పెరిగితే రక్తం రావడం లేదని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఆహారం తీసుకున్న సమయంలో శరీరంలో ఎంతో కొంత కొవ్వు పెరుగుతుంది. అలా పేరుకుపోయిన కొవ్వు ముందుగా ధమనుల్లో చేరుతుంది.
కొవ్వు ఎక్కువగా పేరుకుపోతే రక్త సరాఫరా తగ్గుతుంది దీనివల్ల వెంట్రుకలు కూడా పెరగవు. ముఖ్యంగా కాలి బొటన వేలుపై వెంట్రుకలు పెరిగితే మాత్రం వారికి రక్త సరాపరా బాగా అవుతుందని అర్థం. వారు చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు భావించాలి. వీరికి ఉండే జబ్బులు వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుందట. ముఖ్యంగా ఇతర శరీర భాగాలతో పోల్చుకుంటే గుండె నుంచి చాలా దూరంగా ఉన్న బొటనవేళ్లకు రక్తం ఎక్కువగా సరాఫరా అయితే మాత్రం ఇక మిగతా భాగాలకు కూడా రక్తం అద్భుతంగా వెళుతుందని అర్థం చేసుకోవాలి. అలా రక్తప్రసరణ ఎక్కువగా ఉన్న వ్యక్తులకు గుండె జబ్బులు చాలా తక్కువగా ఉంటాయట.