భారత దేశంలో వినాయక నవరాత్రులను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా తొమ్మిది రోజులపాటు వినాయకుడికి నియమ, నిష్ఠలతో పూజలు జరిపి తొమ్మిదవ రోజున నిమర్జనం చేసేస్తారు.
న్యూస్ లైన్ డెస్క్:భారత దేశంలో వినాయక నవరాత్రులను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా తొమ్మిది రోజులపాటు వినాయకుడికి నియమ, నిష్ఠలతో పూజలు జరిపి తొమ్మిదవ రోజున నిమర్జనం చేసేస్తారు. అలాంటి వినాయక చవితి కేవలం ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా జరుపుతారని చాలామందికి తెలియదు. కానీ ఇండోనేషియాలో ఈ వినాయకునికి అంగరంగ వైభవంగా పూజలు చేస్తారు. ఇండోనేషియాలో వినాయకుడి విగ్రహం ఎక్కడ ఉంది. ఆ వివరాలు ఏంటో చూద్దాం..
ఇండోనేషియాలోని మౌంట్ బ్రొమో తూర్పు జావా ప్రావిన్స్ లోని బ్రోమో టెంగార్ సెమెర్ జాతీయ ఉద్యానవనంలో ఒక అగ్నిపర్వతం ఉంది. దాని పేరు మౌంట్ బ్రోమో. ఇక్కడే 700 ఏళ్ల నాటి ఒక గణపతి విగ్రహం ఉంది. అయితే ఈ విగ్రహాన్ని అక్కడి ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అయితే ఈ గణపతి దేవుడే వారందరినీ అక్కడి అగ్నిపర్వతాల నుంచి కాపాడుతారని వారు నమ్ముతారు. దాదాపుగా ఈ ప్రాంతంలో 130 కి పైగా అగ్నిపర్వత గోళాలు ఉన్నాయట.
అవి విస్పోటం వచ్చినప్పుడు వినాయకుడు అక్కడి ప్రజలకు ఏమి కాకుండా కాపాడతారని వారి విశ్వాసం. ఇందులో బ్రోమో అనే పదం కూడా మన బ్రహ్మా యొక్క జావానీస్ ఉచ్చరణ నుండి ఉద్భవించిందట. ఈ ప్రాంతాలలో మొత్తం ఐదు మిలియన్ల మంది ప్రజలు ప్రమాదకరమైన పరిస్థితుల్లో నివసిస్తూ ఉంటారట. వారందరినీ అగ్నిపర్వతాల విస్ఫోటనాల నుండి ఈ గణేష్ డే రక్షిస్తారని నమ్ముతారు. అయితే ఈ విగ్రహాన్ని టెంగర్ మాసిస్ తెగకు చెందిన వారి పూర్వికులు 700 సంవత్సరాల క్రితం ప్రతిష్టించారని వారు నమ్ముతారు.
అప్పటినుంచి అగ్నిపర్వతాల వల్ల ఎక్కువ మంది మరణించలేదని, హ్యాపీగా జీవిస్తున్నామని వారు చెబుతుంటారు. కాబట్టి వీరు 700 సంవత్సరాల నుంచి ఈ వినాయకుడికి పండ్లు, ఫలాలు నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ఎంతటి విపత్కర పరిస్థితిలో ఉన్న వినాయకుడికి పూజించడం మాత్రం వారు మరువ లేదట. ప్రస్తుతం వినాయక చతుర్థి సందర్భంగా ఈ వినాయకుడు గురించి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.