సాధారణంగా ఉదయం లేవగానే చాలామంది టీ లేదా కాఫీ తాగుతూ ఉంటారు. అలాంటి టీని టిపొడి, చక్కెర, పాలు కలుపుకొని తయారు చేసుకుంటారు. ఈ టీ తాగి వారి యొక్క జీవితంలో దిన చర్యలను
న్యూస్ లైన్ డెస్క్: సాధారణంగా ఉదయం లేవగానే చాలామంది టీ లేదా కాఫీ తాగుతూ ఉంటారు. అలాంటి టీని టిపొడి, చక్కెర, పాలు కలుపుకొని తయారు చేసుకుంటారు. ఈ టీ తాగి వారి యొక్క జీవితంలో దిన చర్యలను మొదలుపెడతారు. మరి ఈ విధమైన టీ కాకుండా మరో రకమైన టీ తాగితే ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుందట. ముఖ్యంగా ఈ టీ ని తాగితే క్యాన్సర్ వ్యాధిని నివారించవచ్చట. మరి ఆ టీ ఏంటి ఆ వివరాలు ఏంటో చూద్దాం..
మన భారతీయులు ఎక్కువగా వంటకాలలో వెల్లుల్లిని వాడుతారు. అసలు ఇది లేకుంటే వండే ఏ పదార్థం అయినా టేస్ట్ రాదు. అలా వెల్లుల్లి అంత వంటలో భాగమైపోయింది. అలాంటి వెల్లుల్లి వంటలకు రుచిని ఇవ్వడమే కాకుండా అనేక ఔషధ గుణాలు కూడా కలిగి ఉంటుందట. ఇప్పటివరకు వెల్లుల్లిని మనం ఎవరు ఆహార పదార్థాలలో మాత్రమే వేయడం చూసాం. కానీ వెల్లుల్లి ద్వారా టీ కూడా తయారు చేసుకుని తాగవచ్చట.
వెల్లుల్లి రెబ్బలను మెత్తగా దంచి టీలో వేస్తే రుచి బాగుంటుందట. అలా ఈ టీవీ ప్రతి రోజు తాగడం వల్ల క్యాన్సర్ ను అధిగమించవచ్చని వ్యవసాయ కేంద్రం నీమాయత్ పూర్ హోమ్ సైన్స్ అధిపతి శాస్త్రవేత్త డాక్టర్ విద్య గుప్తా తెలియజేశారు. ఈ వెల్లుల్లిలో విటమిన్ సి, పొటాషియం, జింక్, మెగ్నీషియం, పోలేట్, విటమిన్ బి3, వంటివి ఉండడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయట.
ఈ విధంగా వెల్లుల్లిని టీలో వేసుకొని బాగా మరిగిన తర్వాత తీసుకోవడం వల్ల క్యాన్సర్ కు చాలా వరకు చెక్ పెట్టవచ్చని ఆయన తెలియజేస్తున్నారు. ఇదే కాకుండా జీర్ణవ్యవస్థ కూడా అద్భుతంగా బలపడుతుందట. కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే టీ తాగే ముందు రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మరిగించుకుని తాగండి. దీనివల్ల క్యాన్సర్ వ్యాధికి చెక్ పెట్టడమే కాకుండా గుండెకు సంబంధించిన వ్యాధులు కూడా దూరం అవుతాయని అంటున్నారు.