ఫోన్ పే( phonepay) , పేటీఎం ( paytm) వచ్చాక చాలా వరకు లైఫ్ ఈజీ అయిపోయింది. ఒకప్పుడు కరెంట్ బిల్ కట్టాలంటే...లైన్లు..ఆఫీసుల్లో పర్మిషన్లు..ఓ పూట పని. ఫోన్ పే , పేటీఎం లాంటి థర్డ్ పార్టీ యాప్ ( third party apps) లు వచ్చాక మాగ్జిమం ఆ కష్టం తగ్గింది. కాని త్వరలో మళ్లీ అదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామంటున్నారు తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఫోన్ పే( phonepay) , పేటీఎం ( paytm) వచ్చాక చాలా వరకు లైఫ్ ఈజీ అయిపోయింది. ఒకప్పుడు కరెంట్ బిల్ కట్టాలంటే...లైన్లు..ఆఫీసుల్లో పర్మిషన్లు..ఓ పూట పని. ఫోన్ పే , పేటీఎం లాంటి థర్డ్ పార్టీ యాప్ ( third party apps) లు వచ్చాక మాగ్జిమం ఆ కష్టం తగ్గింది. కాని త్వరలో మళ్లీ అదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామంటున్నారు తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ.
ఆర్బీఐ నిబంధనల మేరకు ఇకపై విద్యుత్ బిల్లుల చెల్లింపులు ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి యాప్స్ ద్వారా సాధ్యపడవు. వినియోగదారులు డిస్కంల వెబ్ సైట్ లేదా మొబైల్ యాప్‌లోనే బిల్లులు చెల్లించాలి. ఇక పై థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా చెల్లించడం కుదరదు.
జులై నుంచి ఈ యాప్స్ ద్వారా విద్యుత్ బిల్లుల( current bills) చెల్లింపులు సాధ్యపడవు. క్రెడిట్ కార్డు బిల్లుల( credit card) చెల్లింపుల తరహాలోనే ఆయా యాప్స్ ఈ సేవలనూ నిలిపేశాయి. ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి జులై 1 (సోమవారం) నుంచి ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) తమ వెబ్ సైట్( website) లేదా మొబైల్ యాప్‌లోనే( mobile app) బిల్లుల చెల్లింపులు చేయాలని వినియోగదారులకు సూచించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పష్టం చేసింది.