కరెంట్ ఆఫీస్లో ఉద్యోగం ఇప్పిస్తానని బాధితురాలు నుంచి విద్యుత్ శాఖ జూనియర్ అసిస్టెంట్ 19.50 లక్షలు తీసుకొని నకిలీ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చాడు.
న్యూస్ లైన్ డెస్క్: కరెంట్ ఆఫీస్లో ఉద్యోగం ఇప్పిస్తానని బాధితురాలు నుంచి విద్యుత్ శాఖ జూనియర్ అసిస్టెంట్ 19.50 లక్షలు తీసుకొని నకిలీ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చాడు. నాగోల్ మమతనగర్‌కు చెందిన ఓ యువతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపర్ అవుతోంది. అయితే విద్యుత్ శాఖలో (టీజీఎస్పీడీసీఎల్) జూనియర్ అసిస్టెంట్‌గా భువనగిరిలో పనిచేస్తున్న బండారపు కిరణ్ కుమార్ ఆమెకు పరిచయమయ్యాడు. తనకు కూడా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని, విడతల వారీగా రూ.19.50 లక్షలు తీసుకున్నాడు. ఆపై ఉద్యోగం ఇప్పించకుండా కాలయాపన చేస్తుడడంతో ఇటీవల యువతి నిలదీసింది.
దీంతో అతను అపాయింట్మెంట్ లెటర్ తీసుకొచ్చి ఇవ్వగా, అది ఫేక్ అని తేలడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని మరోసారి గట్టిగా అడగడంతో ఆరు నెలల్లో డబ్బులు ఇస్తానని అంగీకరించాడు. కానీ ఆరు నెలలైనా డబ్బులు ఇవ్వకపోవడంతో నాగోలు పోలీస్ స్టేషన్‌లో యువతి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు జూనియర్ అసిస్టెంట్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.