ఆమెపై ఏమరాల్డ్ దుకాణం ప్రతినిధులు దశరథ్, శ్రీనివాస్ రెడ్డి మహిళ అని కూడా చూడకుండా చేయి చేసుకున్నారు
న్యూస్ లైన్ డెస్క్: సేంద్రియ ఉత్పత్తులు అంటూ ఉదరగొట్టి పెద్ద పెద్ద మిఠాయి దుకాణాల మిఠాయి ధరలకు రెట్టింపు ధరలు పెట్టీ ప్రజలను బురిడీ కొట్టిస్తున్న పెరుగొప్ప ఎమరాల్డ్ మిఠాయి దుకాణం నిర్వాకాన్ని ఈ మధ్య ఫుడ్ సేఫ్టీ అధికారులు బయటపెట్టిన విషయం తెలిసిందే. శుచీ శుభ్రత లేకుండా టాయిలెట్ల పక్కన దుర్గంధం పూరితమైన వాతావరణంలో ఎమరాల్డ్ దుకాణం కిచెన్ ఉన్నట్లుగా గుర్తించారు. నిత్యం వందల సంఖ్యలో జనం ఎమరాల్డ్ ఇందిరాపార్క్ వద్ద ఉన్న దుకాణంలో మిఠాయిలు ఇతర తినుబండారాలు తీసుకువెళ్లడం, సబ్దాన్ కలిపిన ఆవుపాలు సేవిస్తుంటారు. వీళ్ళ కస్టమర్లలో ఒకరైన బీసీ మహిళా సంఘం నాయకురాలు మట్టా జయంతి శుక్రవారం సాయంత్రం దుకాణానికి వెళ్లి పరిశుభ్రతపై ప్రశ్నించారు. అయితే ఆమెపై ఏమరాల్డ్ దుకాణం ప్రతినిధులు దశరథ్, శ్రీనివాస్ రెడ్డి మహిళ అని కూడా చూడకుండా చేయి చేసుకున్నారు. ఈ దృశ్యాలు ఏమరాల్డ్ లోని సీసీ కెమెరాల్లో కూడా నమోదయ్యాయి. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన దోమల్ గూడ పీఎస్ పోలీసులు నిండితులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎమరాల్డ్ నిర్వాహకులు ప్రయత్నాలు మొదలపెట్టారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్యను కలిసినట్లు తెలిసింది.