భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు ఎన్కౌంటర్ చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. గుండాల మండలం దామరతోగు-కరకగూడెం మండలం నీలాద్రి పేట అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. కరకగూడెం మండలం రఘునాధపాలెం దగ్గర గ్రేహౌండ్స్ బలగాలకు, లచ్చన్న దళానికి మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్ లో లచ్చన్నతో సహా దళ సభ్యులు మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. అయితే ఎదురు కాల్పుల్లో ఇద్దరు గ్రేహౌండ్ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో పోలీసులు భద్రాచలం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి కానిస్టేబుళ్లకు పోలీసులు చికిత్స అందిస్తున్నారు.
కాగా, ఈ ఎన్కౌంటర్‌లో మృతులు లచ్చన్న దళంకు చెందిన కుంజా వీరయ్య అలియాస్ లచ్చన్న, పూణేం లక్మా, కోవసి రాము, పోడియం కోసయ్య, కోసి, దుర్గేష్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఎన్‌కౌంటర్ స్థలం నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలో గత కొంతకాలంగా మణుగూరు ఏరియా కమిటీ కార్యదర్శి లచ్చన్న దళం కార్యకలాపాలు కొనసాగిస్తుంది. చత్తీస్గడ్ నుంచి వలస వచ్చిన మావోయిస్టు పార్టీకి చెందిన లచ్చన్న నాయకత్వంలో దళం సంచరిస్తున్నట్లు సమాచారం.