Recipe : అన్నం వండేందుకు ముందే బియ్యం నానబెడుతున్నారా.. అస్సలు వద్దు

అన్నం వండడానికి చాలామంది బియ్యం ముందే కడిగి పెట్టుకుంటారు. ఇలా చేస్తే అన్నం తొందరగా ఉడుకుతుందని.. బియ్యం బాగా నానుతాయని చెప్తారు. కానీ.. ఇలా చేయడం అస్సలు కరెక్ట్ కాదట.


Published Jul 31, 2024 09:21:21 AM
postImages/2024-07-31/1722435622_ricerecipecopy.jpg

న్యూస్ లైన్ డెస్క్ : అన్నం వండడానికి చాలామంది బియ్యం ముందే కడిగి పెట్టుకుంటారు. ఇలా చేస్తే అన్నం తొందరగా ఉడుకుతుందని.. బియ్యం బాగా నానుతాయని చెప్తారు. కానీ.. ఇలా చేయడం అస్సలు కరెక్ట్ కాదట. అన్నంలో ఉండే పోషకాలు, కార్బోహైడ్రేట్లు పాడైపోతాయటంటున్నారు పోషకాహార నిపుణులు. అంతేకాదు.. మైక్రో ఓవెన్, ఎలక్ట్రిక్ రైస్  కుక్కర్ లో వండిన అన్నం కూడా ఆరోగ్య సమస్యలకు కారణమవుతుదని హెచ్చరిస్తున్నారు.  

ఈ చిట్కాలు పాటించండి..

  • అన్నం వండటానికి కేవలం 10 నిమిషాల ముందు బియ్యం నానబెడితే చాలు.
  • గంటలు గంటలు బియ్యం అస్సలు నానబెట్టొద్దు.
  • ఎక్కువసేపు బియ్యాన్ని నీటిలో నానబెట్టడం వల్ల అందులోని పోషకాలు నశిస్తాయి.
  • నీళ్లలో బియ్యం ఎక్కువసేపు ఉంటే అందులోని గైసెమిక్ ఇండెక్స్ లెవల్స్ పెరుగుతాయి.
  • రక్తంలో చక్కెర స్థాయిలు ఎలా ఉన్నాయో గైసెమిక్ ఇండెక్స్ చెప్తుంది.
  • బియ్యాన్ని కొద్ది సమయం మాత్రమే నానబెడితే బియ్యంలోని ఎంజైమాటిక్ విచ్ఛిన్నం జరుగుతుంది.
  • ఇది మధుమేహంతో బాధపడేవారికి చాలా ఉపయోగకరం.
  • అంతేకాదు.. ఎట్టి పరిస్థితుల్లోనూ మైక్రో ఓవెన్, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లలో వండిన అన్నం తినొద్దు.

 

newsline-whatsapp-channel
Tags : viral-news good-life life-style happy-life latest-news news-updates telugu-news

Related Articles