రాష్ట్రంలో అన్నదాతల కష్టాలు మాత్రం తీరడం లేదు. ప్రభుత్వం ఎన్ని గొప్పలు చెప్పినా రైతుల బాధలు మాత్రం తీరడం లేదు. పంట సీజన్ మొదటల్లో విత్తనాలు, ఎరువులతో ఇబ్బందులు పడితే ఇప్పుడు కరెంటు కోతలు మళ్లీ మొదలయ్యాయి.
న్యూస్ లైన్, నిజామాబాద్: రాష్ట్రంలో అన్నదాతల కష్టాలు మాత్రం తీరడం లేదు. ప్రభుత్వం ఎన్ని గొప్పలు చెప్పినా రైతుల బాధలు మాత్రం తీరడం లేదు. పంట సీజన్ మొదటల్లో విత్తనాలు, ఎరువులతో ఇబ్బందులు పడితే ఇప్పుడు కరెంటు కోతలు మళ్లీ మొదలయ్యాయి. దీంతో అన్నదాతలు మళ్లీ రోడ్డుకెక్కాల్సిన పరిస్థితులు వచ్చాయి. కరెంట్ కోతలను నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా సిరికొండ రైతులు స్థానిక సబ్ స్టేషన్‌ను ముట్టడించారు. కొంత కాలంగా విద్యుత్తు సమస్యలు వేధిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడు పడితే అప్పుడు కరెంట్ కోతలు పెడుతున్నారని, కరెంటు ఎప్పుడో వస్తోందో, ఎప్పుడు పోతుందో కూడా తెలియదంటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కోతలు విధించడమేమిటని ప్రశ్నించారు. లో వోల్టేజ్ సమస్యతో ఇళ్లల్లో ఫ్రీజ్లు, టీవీలు, కూలర్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.