Students: ప్రభుత్వ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్

ధర్మపురి నియోజకవర్గం, గొల్లపల్లి మండల కేంద్రంలోని మహత్మ జ్యోతిబా పులే బాలికల హాస్టల్‌లో ఐదుగురు విద్యార్థినిలకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.


Published Aug 13, 2024 09:28:44 PM
postImages/2024-08-13/1723564724_poison.PNG

న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణలో రోజురోజుకీ ఫుడ్ పాయిజనింగ్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్ల గాల్లో దీపంలా విద్యార్థుల ప్రాణాలు పరిస్థితి ఏర్పడింది. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం, గొల్లపల్లి మండల కేంద్రంలోని మహత్మ జ్యోతిబా పులే బాలికల హాస్టల్‌లో ఐదుగురు విద్యార్థినిలకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే హస్టల్ యాజమాన్యం 108 వాహనంలో జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆక్సిజన్ ద్వారా విద్యార్థులకు వైద్యం అందిస్తున్నారు. అయితే మంగళవారం జగిత్యాల జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. కాగా, సాయంత్రమే జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఫుడ్ పాయిజన్ ఘటన జరిగింది. విద్యార్థులు తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకుని ఆందోళన చేస్తున్నారు. 

newsline-whatsapp-channel
Tags : india-people students congress cm-revanth-reddy food-poison

Related Articles