విజయవాడలో ప్రజల కష్టాలను చుస్తే గుండె తరుక్కుపోతుందని, చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు వరదల్లో చిక్కుకుపోయి అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు
న్యూస్ లైన్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక విజయవాడ మొత్తం నీట మునిగింది. ఈ నేపథ్యంలో వరద బాధితులపై వైఎస్సార్సీపీ పార్టీ మాజీ మంత్రి రోజా స్పందించారు. మంగళవారం సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేశారు. ఈ వీడియోలో రోజా మాట్లాడుతూ విజయవాడలో ప్రజల కష్టాలను చూస్తే గుండె తరుక్కుపోతుందని, చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు వరదల్లో చిక్కుకుపోయి అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కష్టాలు వర్ణనాతీతం.. వారి మాటలు వింటుంటే నాలుగురోజుల నుంచి వాళ్లు ఎంత నరకం అనుభవించారో అర్థమవుతుందని రోజా అన్నారు.
ఎంతమంది వరదల్లో కొట్టుకపోయారో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. ప్రజలు ఇన్ని కష్టాలు పడటానికి, ఇంత మంది ప్రాణాలు పోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదా అని ప్రశ్నించారు. మంత్రులు విహార యాత్రలకు వెళ్లి ప్రజలను వరదల్లో ముంచేశారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వరద బాధితులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే సహాయ చర్యలు ముమరం చేసి విజయవాడ వరద బాధితులను రక్షించాలని మాజీ మంత్రి రోజా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రజల కష్టాలను చుస్తే గుండె తరుక్కుపోతుంది
మాజీ మంత్రి రోజా ఎమోషనల్ వీడియో pic.twitter.com/PBgWuN8RXp — News Line Telugu (@NewsLineTelugu) September 3, 2024