Ghmc: ఆకస్మిక తనిఖీలు చేసిన కమిషనర్‌ ఆమ్రపాలి

Published 2024-07-03 09:56:47

postImages/2024-07-03/1720018030_amrapali.PNG

న్యూస్ లైన్ డెస్క్: హైదరాబాద్ నగరంలో పారిశుద్ధ్యం నిర్వహణపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కాటా ఆమ్రపాలి బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో ఉన్న జంక్షన్, బస్టాండు, రైతు బజార్, వాణిజ్య సముదాయాల్లో తనిఖీలు చేపట్టారు.  నారాయణగూడ క్రాస్‌రోడ్‌లో పారిశుద్ధ్య నిర్వహణను కమిషనర్‌ పరిశీలించి జోనల్‌ కమిషనర్‌ను ఆదేశించారు. అక్కడ నిర్మించిన మార్కెట్ భవనంలో స్థలాల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమ్రపాలి శంకర్ మఠం వద్ద ఆర్‌ఎఫ్‌సి వాహనం డ్రైవర్‌తో మాట్లాడి చెత్త తరలింపుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓ విద్యార్థినితో మాట్లాడి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. కార్వాన్ రింగ్ రోడ్ నుంచి జియాగూడ మీదుగా మూసీ నదిపై ఉన్న ఆక్రమణలపై సర్వే నిర్వహించాలని జోనల్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. రోడ్డుపై భవన నిర్మాణ వ్యర్థాలను వెంటనే తొలగించాలని అమ్రపాలి ఆదేశించారు.