కామారెడ్డి జిల్లాలో పేపర్ లీక్ అయ్యింది. జుక్కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రశ్నాపత్రంలోని కొన్ని క్వశ్చన్స్ ను సిబ్బంది లీక్ చేశారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : తెలంగాణలో టెన్త్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరుగనున్నాయి. మరో వైపు చాలా ప్రాంతాల్లో క్వశ్చన్ పేపర్ లీకేజ్ ఘటనలు చోటు చేసుకున్నాయి. రీసెంట్ గా నిన్న కామారెడ్డి జిల్లాలో పేపర్ లీక్ అయ్యింది. జుక్కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రశ్నాపత్రంలోని కొన్ని క్వశ్చన్స్ ను సిబ్బంది లీక్ చేశారు.
పరీక్షకు కొన్ని నిమిషాల ముందు కొన్ని ప్రశ్నలను కాగితంపై రాసి బయటకు పంపారు. ఆక్వశ్చన్స్ సోషల్ మీడియా లో ఫుల్ వైరల్ అయ్యాయి. విషయం తెలుసుకున్న జిల్లా కలక్టర్ చర్యలు తీసుకున్నారు. ఎగ్జామ్ సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్ సునీల్ , డిపార్ట్ మెంటల్ ఆఫీసర్ భీమ్ , ఇన్విజిలేటర్ దీపికను విధుల నుంచి సస్పెండ్ చేశారు.