తూర్పు , దక్షిణ తెలంగాణ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీలకు చేరే అవకాశం ఉంది. చిన్నపిల్లలు , ముసలివాళ్లు బయట ప్రయాణాలు మానుకుంటే మంచిది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఉత్తర తెలంగాణ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. వచ్చే నాలుగు రోజులు ఉత్తర , తూర్పు , దక్షిణ తెలంగాణ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీలకు చేరే అవకాశం ఉంది. చిన్నపిల్లలు , ముసలివాళ్లు బయట ప్రయాణాలు మానుకుంటే మంచిది.
పశ్చిమ జిల్లాల్లో 36 డిగ్రీల నుంచి 40వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. మార్చి నెలాఖరు నుంచి తెలంగాణలో వడగాల్పులు వీచే అవకాశముందని తెలిపారు. ఈ నాలుగు రోజుల్లో వడగాలులు ఎక్కువ అవ్వడంతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.నల్గొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి, కట్టంగూర్ ప్రాంతాల్లో 41.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మార్చి లోనే 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంపై చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. సూర్యాపేట , యాదాద్రి ప్రాంతాల్లో మరింత ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది.