వారం రోజులుగా రోజురోజుకుక తగ్గుతూ వస్తున్న బంగారం ధరల్లో నేడు కూడా స్వల్ప మార్పు కనిపించింది. హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 63,410కి చేరింది. 24 క్యారెట్ల బంగారం 69.170కి చేరింది.
న్యూస్ లైన్ డెస్క్ : బడ్జెట్ 2024 వల్ల దేశంలో బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి. వరుసగా బంగారం నేల చూపులు చూస్తూ సామాన్యుడి వైపు దిగి వస్తోంది. మొన్నటి బడ్జెట్ సమావేశాల్లో బంగారం, వెండి మీద కస్టమ్స్ డ్యూటీ 6 శాతానికి తగ్గించడంతో బంగారం ధరల్లో భారీ మార్పు కనిపిస్తోంది.
వారం రోజులుగా రోజురోజుకుక తగ్గుతూ వస్తున్న బంగారం ధరల్లో నేడు కూడా స్వల్ప మార్పు కనిపించింది. హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 63,410కి చేరింది. 24 క్యారెట్ల బంగారం 69.170కి చేరింది. నిన్నటితో పోల్చితే బంగారం ధర పది రూపాయలు తగ్గింది. గడిచిన పదిహేను రోజుల్లో బంగారం దాదాపు రూ. 5 వేలు తగ్గింది.
బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగానే తగ్గాయి. ఈరోజు హైదరాబాద్ లో కిలో వెండి రూ.89,600 రూపాయలు ఉంది. ప్రస్తుతానికి వెండి, బంగారం ధరలు తగ్గినా.. భవిష్యత్తులో మళ్లీ పెరుగుతాయని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. దీంతో.. పసిడి ప్రియులు ఇదే మంచి అవకాశంగా బంగారం కొనేందుకు సిద్ధమవుతున్నారు.