చిన్న స్వీపర్ పోస్ట్ కోసం కూడా గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకునే పరిస్థితి వచ్చింది. అయితే, ఒక్కరో ఇద్దరు కాదు ఏకంగా 46 వేల మంది గ్రాడ్యుయేట్లు స్వీపర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: ఏళ్లకు ఏళ్లు పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద డిగ్రీలు పొంగినవారు కూడా చిన్నాచితకా ప్రభుత్వ ఉద్యోగాల కోసం కష్టపడడం చూస్తూనే ఉంటాం. పెద్ద డిగ్రీలు సాధించిన వారు కూడా చిన్న ఉద్యోగాల కోసం ఆరాటపడడం సహజమే. చిన్నదైనా సరే.. ప్రభుత్వ ఉంద్యోగం ఉంటే చాలు అనే ధోరణిలో చాలా మంది ఆలోచించడమే దీనికి కారణం. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం కారణంగా యువత ఏదో ఒక పని చేసుకుంటున్నారు.
అయితే, చిన్న స్వీపర్ పోస్ట్ కోసం కూడా గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకునే పరిస్థితి వచ్చింది. అయితే, ఒక్కరో ఇద్దరు కాదు ఏకంగా 46 వేల మంది గ్రాడ్యుయేట్లు స్వీపర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. స్వీపర్ పోస్టులకు ఇటీవల హర్యానా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి జీతం రూ.15 వేలు. ప్రభుత్వ ఉద్యోగం అయితే భవిష్యత్తులో పర్మినెంట్ అవుతుందనే ఆశతో గ్రాడ్యుయేట్లు కూడా స్వీపర్ ఉద్యోగానికి దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తోంది.