పూర్వకాలంలో వారి రాజ్యాలను పాలిస్తూ రాజ్యంలో ప్రజలకు ఏదైనా కష్టం వస్తే ముందుండి చూసుకునేవారు. అలాంటి రాజుల కుటుంబీకుల నుంచి వచ్చినటువంటి ప్రభాస్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన
న్యూస్ లైన్ డెస్క్: పూర్వకాలంలో వారి రాజ్యాలను పాలిస్తూ రాజ్యంలో ప్రజలకు ఏదైనా కష్టం వస్తే ముందుండి చూసుకునేవారు. అలాంటి రాజుల కుటుంబీకుల నుంచి వచ్చినటువంటి ప్రభాస్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన హీరోగా మారారు. మొదట ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఈయన ఏం సినిమాలు చేస్తారు తాడిలా ఉన్నారు హీరోకి పనికొస్తారా అనుకున్నారు. అలా చాలామంది ప్రభాస్ ను చూసి అవకాశాలు కూడా ఇవ్వలేదు. అలాంటి ప్రభాస్ కోసం ప్రస్తుతం దర్శక నిర్మాతలు క్యూ కట్టే పరిస్థితి ఏర్పడింది.
మరి ఈయన ఇంతటి స్థాయికి వెళ్లడానికి ప్రధాన కారకుడు రాజమౌళి అని చెప్పవచ్చు. బాహుబలి సినిమా ద్వారా ప్రభాస్ ను బడా హీరోని చేసేసాడు. ఇక అప్పటినుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. హిట్స్ ప్లాప్స్ అనే సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఒక్కో సినిమాకి 100 కోట్ల నుంచి 200 కోట్ల మధ్యలో రెమ్యూనరేషన్ కూడా అందుకుంటున్నట్టు తెలుస్తోంది. మరి ఇంత డబ్బు సంపాదించి ప్రభాస్ ఎవరికి పెడతారు అని చాలామంది అనుకుంటారు. ప్రభాస్ ఎంత సంపాదించినా కానీ అందులో చాలా వరకు పేద ప్రజల కోసం ఖర్చు పెడతారట.
అయితే ఈయన ఖర్చు పెట్టింది బయట ఎవరికి చెప్పుకోవడం ఇష్టం ఉండదట. అందుకే ఆయన ఎంతోమంది నిరుపేదలకు సహాయ సహకారాలు అందిస్తారని తెలుస్తోంది. తాజాగా కేరళలోని వయనాడ్ కు రెండు కోట్ల విరాళం అందించి తన పెద్ద మనసు చాటుకున్నాడు. ఇదే తరుణంలో ప్రభాస్ గురించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రభాస్ ప్రతి ఏటా ఒక పాఠశాలలోని నిరుపేద పిల్లలను దత్తత తీసుకొని ప్రతి ఏటా 100 మంది పిల్లలను చదివిస్తున్నారట. వారి స్కూల్ ఫీజు నుంచి మొదలు బట్టలు అన్ని తానే చూసుకుంటున్నారట.
ప్రతి ఏటా ఒక 100 మంది పిల్లలను ప్రయోజకుల్ని చేసే ప్రోగ్రాం ప్రభాస్ ఎప్పటినుంచో చేస్తూ వస్తున్నారట. అంతేకాదు ఆయన ఎన్నో అనాధ ట్రస్టులకు విరాళాలు కూడా అందిస్తారట. ఈ విషయాన్ని ఎక్కడ బయట చెప్పుకోవడం ఇష్టం లేక ఆయన సీక్రెట్ గా ఇవన్నీ చేస్తారని అంటున్నారు ఆయన సన్నిహితులు. ప్రస్తుతం ప్రభాస్ గురించి ఈ వార్త బయటికి రావడంతో ఎంత గొప్ప మనసో గ్రేట్ ప్రభాస్ అంటూ ఆయన అభిమానులు కాలర్ ఎగరేసుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.