రెండు తెలుగు రాష్ట్రాల్లో అమ్మాయిల హాస్టల్లో సీక్రెట్ కెమెరా పెట్టిన ఘటన సంచలనంగా మారింది. గుడివాడలోని గుడ్లవల్లేరు కాలేజ్ గర్ల్స్ హాస్టల్ లోని బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు ఉన్నట్టు అమ్మాయిలు గుర్తించారు. మరి ఈ
న్యూస్ లైన్ డెస్క్:రెండు తెలుగు రాష్ట్రాల్లో అమ్మాయిల హాస్టల్లో సీక్రెట్ కెమెరా పెట్టిన ఘటన సంచలనంగా మారింది. గుడివాడలోని గుడ్లవల్లేరు కాలేజ్ గర్ల్స్ హాస్టల్ లోని బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు ఉన్నట్టు అమ్మాయిలు గుర్తించారు. మరి ఈ సీక్రెట్ కెమెరాలు పెట్టింది ఎవరు. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. అమ్మాయిల హాస్టల్ లోని బాత్రూంలో కెమెరాలు పెట్టింది బీటెక్ చివరి ఏడాదిలో ఉన్నటువంటి విజయ్ కుమార్ అనే విద్యార్థి అంటూ చాలామంది ఆరోపణలు చేస్తున్నారు.
అంతేకాదు అందరూ కలిసి ఆయనపై దాడి చేసేందుకు కూడా ప్రయత్నాలు చేశారు. వెంటనే పోలీసులకు సమాచారం వెళ్లడంతో విజయ్ ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో గర్ల్స్ హాస్టల్ లో ఉండేటువంటి ఆడపిల్లలంతా హాస్టల్ వదిలి బయటకు వచ్చి టార్చ్ లైట్ లు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఇదే తరుణంలో తాజాగా ఒక విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో కెమెరాలు పెట్టింది విజయ్ కుమార్ కాదని , గర్ల్స్ హాస్టల్ లో ఉండే ఒక అమ్మాయిని తెలుస్తోంది.
ఆమె కూడా వీరితోనే అదే కాలేజీలో చదువుతుందట. ఆ అమ్మాయి విజయ్ కుమార్ ప్రేమలో ఉన్నారని, వీరిద్దరూ కలిసి తరచూ "ఓయో' కు వెళ్లి వచ్చేవారని, ఒకసారి ఆ అమ్మాయితో విజయ్ ఓయో రూముకు వెళ్లిన సమయంలో వారు ప్రైవేట్ గా కలిసినటువంటి వీడియోలను అన్నిటినీ విజయ్ కుమార్ రికార్డు చేశారట. ఆ రికార్డులను తన స్నేహితులకు పంపించాడట. దీంతో తన స్నేహితులంతా ఆ అమ్మాయిని ఫోటోలు, వీడియోలు బయటపెడతామని బెదిరింపులకు గురి చేశారట. అంతేకాదు మీ హాస్టల్లో ఉండేటువంటి అమ్మాయిల నగ్న ఫోటోలు, వీడియోలు కావాలని డిమాండ్ చేసేవారట.
దీంతో భయపడిపోయిన అమ్మాయి ఈ విషయాన్ని తన లవర్ విజయ్ కి కూడా చెప్పిందట. దీంతో విజయ్ కూడా అక్కడ సీక్రెట్ కెమెరాలను పెట్టాలని ఐడియా ఇచ్చినట్టు తెలుస్తోంది. అలా అమ్మాయిల బాత్రూంలో ఆమె సీక్రెట్ కెమెరాలు పెట్టిందట. ఇది కాస్త బయటకు రావడంతో పోలీసులు ఆ అమ్మాయిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందించి విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేశారు. నిజంగానే విజయ్ తన లవర్ కలిసి ఈ పని చేశారా? లేదంటే ఇంకెవరైనా చేశారా? అనేది విచారణలో వెళ్లడవుతుంది.