ఇప్పుడు ఎవరు రాజీనామా చేయాలో, ఎవరు ఏటిలో దూకి చావాలో, ఎవరికి చీము నెత్తురు లేదో, ఎవరు అమర వీరుల స్థూపం దగ్గర ముక్కు భూమికి రాయాలో, ఎవరు రాజీనామా చెయ్యాలో సిఎం రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేస్తూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టారు.
న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ నేతలే రుణమాఫీ కాలేదని ఒప్పుకుంటున్నారని మాజీ మంత్రి, సిద్ధిపేట BRS ఎమ్మెల్యే హరీష్ రావు తేలిపారు. కాంగ్రెస్ నేతలు కోదండ రెడ్డి, కోదండరాం రెడ్డి, ఆది శ్రీనివాస్ ముగ్గురు ఒప్పుకుంటున్నది రుణమాఫీ సంపూర్ణంగా కాలేదనే అని ఆయన తెలిపారు.
ఇప్పుడు ఎవరు రాజీనామా చేయాలో, ఎవరు ఏటిలో దూకి చావాలో, ఎవరికి చీము నెత్తురు లేదో, ఎవరు అమర వీరుల స్థూపం దగ్గర ముక్కు భూమికి రాయాలో, ఎవరు రాజీనామా చెయ్యాలో సిఎం రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేస్తూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టారు.
రాష్ట్రంలో పూర్తిగా రుణమాఫీ కాలేదనే తాను కూడా చెబుతున్నానని హరీష్ రావు తెలిపారు. మొదట రూ.31 వేలు కోట్లు అని చెప్పి రూ.17 వేల కోట్లతో మాత్రమే రుణమాఫీ చేశారని అంటే ఎందుకు రంకెలేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. నిజంగానే పూర్తిస్దాయిలో రుణమాఫీ జరిగితే.. రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఎందుకు రోడ్లెక్కి నిరసనలు తెలుపుతారని ఆయన ప్రశ్నించారు.
ప్రతీ అంశాన్ని రాజకీయ కోణంలో చూడటం, తొండి చేసైనా మేమే గెలిచినం అనే వైఖరి ప్రదర్శించడం అవివేకం అవుతుందని ఆయన వెల్లడించారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి, రుణమాఫీ ప్రక్రియను తూతూ మంత్రంగా కాకుండా సమగ్రంగా పూర్తి చేయాలని, రైతులందరికీ న్యాయం చేయాలని హరీష్ రావు కోరారు.