తెలంగాణ ప్రభుత్వం యుటిలైజేషన్ సర్టిఫికేట్ఇవ్వకపోవడం వల్లనే జూన్ 2024కి సంబంధించి రూ. 208.40 కోట్ల SDRF నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయలేకపోయిందని హోంశాఖ లేఖలో బయటపడిందని ఆయన విమర్శించారు.
న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణలో ప్రస్తుత ప్రకృతి వైపరీత్యాలు, వరదల పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కేవలం అసమర్థత మాత్రమే కాదు ప్రజలపై నమ్మక ద్రోహమని మాజీ మంత్రి, సిద్ధిపేట BRS ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పూర్తి వైఫల్యాన్ని హోంశాఖ లేఖ బట్టబయలు చేసిందంటూ ఆయన ట్వీట్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం యుటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వల్లనే జూన్ 2024కి సంబంధించి రూ. 208.40 కోట్ల SDRF నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయలేకపోయిందని హోంశాఖ లేఖలో బయటపడిందని ఆయన విమర్శించారు. ఇంతలో, సహాయ నిర్వహణ కోసం SDRFలో రూ.1,345.15 కోట్లు అందుబాటులో ఉన్నాయని తెలంగాణ అకౌంటెంట్ జనరల్ వెల్లడించారని ఆయన అన్నారు.
ముఖ్యమైన నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యం చేయడమే కాకుండా ప్రజల సమస్యలను చూసి చూడనట్లు వదిలేస్తోందని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మంలో వరదలు వస్తున్న సమయంలో ప్రజలకు సహాయం చేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఆయన విమర్శించారు.