న్యూస్ లైన్ డెస్క్ : వాతావరణ శాఖ తెలంగాణకు శుభవార్త చెప్పింది. బంగాళాఖాతంలోని వాయుగుండం బలహీనపడిందని తెలిపింది. మరో 12 గంటల్లో రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని.. రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తూర్పు విదర్భను ఆనుకొని తెలంగాణ మీదుగా బలహీనపడిన వాయుగుండం కేంద్రీకృతం అయిందని.. ఇది రామడుండానికి ఈశాన్య వైపున 130 కి.మీ దూరంలో ఉందని హైదరాబాద్ వాతావారణ కేంద్రం ప్రకటించింది.
ఈ ప్రభావంతో రాబోయే 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని.. హైదరాబాద్ లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. సెప్టెంబర్ 6 వరకు వర్షాలు ఇలాగే కొనసాగుతాయని..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.