hibiscus tea: మందార పూల టీ తాగితే జరిగే మ్యాజిక్ ఇదే..!

నీలి శంకం పూలు టీలు చేసుకొని రతాగుతున్నారు. అసలు మందారం టీ ని ఎలా  తయారుచేసుకోవాలో ..ఎలా ఆరోగ్యానికి ఉపయెగపడుతుందో చూద్దాం


Published Aug 14, 2024 07:29:21 AM
postImages/2024-08-14/1723634403_hibiscustea.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : ఇప్పుడు హెల్త్  మీద జాగ్రత్తలు ఎక్కువైపోయాయి. ప్రతి రోజు ఉదయాన్నే ఏదో ఒక కొత్త డ్రింక్ ను ..ఆయుర్వేదిక్ టీలతో పాటు...ఇప్పుడు మందారం టీలు, నీలి శంకం పూలు టీలు చేసుకొని తాగుతున్నారు. అసలు మందారం టీ ని ఎలా  తయారుచేసుకోవాలో ..ఎలా ఆరోగ్యానికి ఉపయెగపడుతుందో చూద్దాం


ముద్ద మందారం పూలు, మందారం ఆకులు మన  అందాన్ని పెంచడంలోనూ సహాయం చేస్తాయి. ఎక్కువగా మనం.. మందారపూలు, ఆకులు జుట్టు బలంగా పెరగడానికి, మృదువుగా మారడానికి వాడతాం. కాని మందారం పూలు టీ తాగడం వల్ల రక్తంలో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా తగ్గుతాయి. అంతేకాదు గుండె కు రక్తం వెళ్లే దారులు ఎలాంటిక్లాట్స్ లేకుండా మందారం టీ కాపాడుతుంది.


ఎండిపోయిన మందారపూల రెమ్మలను రెండు, మూడు స్పూన్లు తీసుకోవాలి. అప్పుడు వీటిని రెండు కప్పుల నీటిలో వేయాలి. అంతే.. ఐదు నిమిషాలపాటు మరిగించితే.. ఈ మందారపూల టీ తయారైనట్లే. మీకు కాని ఈ రసం తాగలేకపోతే చిన్న అల్లం ..నిమ్మకాయ యాడ్ చేసుకొండి .ఫ్లేవర్ అద్దిరిపోతుంది. రెగ్యులర్ గా తాగడం వల్ల.. హై బీపీ కి ఇక మీరు ట్యాబ్లెట్స్ మింగాల్సిన అవసరం కూడా ఉండదు. మందారపూల టీలో యాంటీడిప్రసెంట్ ప్రాపర్టీలు పుష్కలంగా ఉంటాయి. 


ఈ మందారపూల టీని ప్రతిరోజూ ఉదయం తాగడం వల్ల.. సులభంగా బరువు తగ్గవచ్చు.  శరీరంలోని కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. మనం తినే ఫుడ్ నుంచి ఫాస్ట్ గా షుగర్ ను బ్లడ్ లో కలవనివ్వదు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu health-benifits hibiscus-tea ayurvedic-drink

Related Articles