viral: భరణం కోసం హైకోర్టుకు వెళ్లిన వృధ్ధ దంపతులు !

ముసలి జంట విడాకుల కోసం కోర్టు మెట్లెక్కారు. పోనీ స్వేఛ్ఛగా బతకాలనుకుంటున్నారని  విడాకులు ఇచ్చారు. కాని ఏం చేస్తాం ..భరణం కోసం కొట్టుకోవడం స్టార్ట్ చేశారు.


Published Sep 25, 2024 08:05:00 PM
postImages/2024-09-25/1727274989_alahabad.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఇప్పుడు విడాకులు చాలా కామన్ అందరికి తెలిసిందే. కాని ముసలి వాళ్లు కూడా విడాకులు కోరుకోవడం ..ఇన్నేళ్లకు వాళ్లకి స్వేఛ్ఛకి ఎందుకు కావాలనిపించిందో తర్వాత విషయం కాని  భరణం కోసం కొట్టుకోవడం మరో వింత. ఈ జనరేషన్ కు పెళ్లి మీద నమ్మకం లేదని ఏవేవో చెప్తారు.కాని ఓ ముసలి జంట విడాకుల కోసం కోర్టు మెట్లెక్కారు. పోనీ స్వేఛ్ఛగా బతకాలనుకుంటున్నారని  విడాకులు ఇచ్చారు. కాని ఏం చేస్తాం ..భరణం కోసం కొట్టుకోవడం స్టార్ట్ చేశారు.


మనోవర్తి కోసం హైకోర్టు దాకా వచ్చిన ఆ జంటలో భార్య వయసు 75 ఏళ్లు కాగా భర్త వయసు 80 ఏళ్లు కావడమే అలహాబాద్ హైకోర్టు విచారణకు ఈ కేసును తీసుకుంది. అయితే ఈ వయసులో ఇలా విడాకులు కోసం కొట్టుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉందని తెలిపారు. 


అలీగఢ్ కు చెందిన మునేశ్ కుమార్ గుప్త (80) తన భార్య నుంచి విడాకులు పొం దారు. ఈ సందర్భంగా మనోవర్తి కావాలంటూ గుప్త భార్య కోరగా.. ఫ్యామిలీ కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. అయితే ముసలావిడకి మాత్రం భరణం విషయంలో లెక్క తేలలేదు. ఈ వయసులో విడిపోయామనే బాధ లేకుండా భరణం కోసం హైకోర్టు వెళ్లింది. దీంతో జస్టిస్ సౌరభ్ శ్యామ్ కేసు విని చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకు ఈ గొడవ ఈ వయసులో ...అని కూర్చొబెట్టి మాట్లాడి సర్ధిచెప్పి డీల్ సెట్ చేశారట.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu wedding divorce

Related Articles