ప్రభుత్వం చెబుతున్న కొత్త నిబంధనల ప్రకారమైతే వేలాది మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులు తెలంగాణలో లోకల్ అవుతారు. దీంతో తెలంగాణ విద్యార్థులు మెడిసిన్ సీట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ విషయంపై ఇప్పటికే తెలంగాణ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రభుత్వానికి లేఖ రాశారు.
న్యూస్ లైన్ డెస్క్: జీవో 33పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత జీవో 33ని అమలు చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కొత్త విధానం ప్రకారం.. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మన వద్ద చదివిన విద్యార్థులే స్థానికులు అవుతారు. అయితే, ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల చాలా మంది హైదరాబాద్‌లోని పెద్ద పెద్ద విద్యాసంస్థల్లో చదువుతున్నారు. కొత్త నిబంధనల ప్రకారం వారంతా తెలంగాణలో లోకల్ అవుతారు. ఇతర రాష్ట్రాలలో చదివే తెలంగాణ విద్యార్థులు నాన్ లోకల్ అయ్యే ప్రమాదం ఉంది.
ప్రభుత్వం చెబుతున్న కొత్త నిబంధనల ప్రకారమైతే వేలాది మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులు తెలంగాణలో లోకల్ అవుతారు. దీంతో తెలంగాణ విద్యార్థులు మెడిసిన్ సీట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ విషయంపై ఇప్పటికే తెలంగాణ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రభుత్వానికి లేఖ రాశారు. అయినప్పటికీ ఈ విధానంపై ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. దీంతో పలువురు ఈ అంశంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించారు. గురువారం జీవో 33కి సంబంధించిన పిటిషన్ పై న్యాయస్థానం విచారణ జరిపింది.
విద్యార్థుల లొకాలిటీని నిర్ధారించుకున్నాకే.. వారి దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు సూచించింది. ఆ విద్యార్థులు తెలంగాణ శాశ్వత నివాసులేనా.. కాదా అన్నది పరిశీలించాలని సూచించించి. ఇందుకోసం ప్రస్తుతం గైడ్‌లైన్స్ లేదు కాబట్టి.. కొత్తగా రూపొందించుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ఆ మార్గదర్శకాలను పాటించాలని కాళోజీ వర్సిటీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.