మల్టీ-లేయర్డ్ ఆఫ్‌షోర్ ఫండ్ నిర్మాణంలో కూడా బుచ్ కు వాటా ఉందని ఆమె ఆరోపించారు. అందుకే అదానీకి సంబంధించి గతంలో బయటకు వచ్చిన విషయాలపై ఆమె చర్యలు తీసుకోలేదని అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: అమెరికన్ సార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికతో మరోసారి ప్రకంపనలు మొదలయ్యాయి. ఇప్పటికే పలు మార్లు అదానీ గ్రూప్, అదానిపై ఆమె సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది జనవరిలో ఆమె విడుదల చేసిన నివేదిక కారణంగా అదానీ సంస్థకు భారీ నష్టం వాటిల్లిందని చెప్పుకోవచ్చు.
ఇక తాజగా, ఆమె మరోసారి తన రీసెర్చ్ నివేదికను విడుదల చేయడంతో ఈ అంశం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సెబి ఛైర్‌పర్సన్ మాధబి బుచ్, తన భర్త ధవల్ బుచ్ లాపై సంచలన ఆరోపణలు చేశారు. భారతదేశ స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ ఛైర్‌పర్సన్ హోదాలో ఆమె చేసిన కొన్ని ప్రకటనల ద్వారా ఆమెకు పర్సనల్‌గా ప్రయోజనం జరిగిందని హిండెన్‌బర్గ్ ఆరోపించారు. మల్టీ-లేయర్డ్ ఆఫ్‌షోర్ ఫండ్ నిర్మాణంలో కూడా బుచ్ కు వాటా ఉందని ఆమె ఆరోపించారు. అందుకే అదానీకి సంబంధించి గతంలో బయటకు వచ్చిన విషయాలపై ఆమె చర్యలు తీసుకోలేదని అన్నారు.
అయితే, హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు మాధబి పూరీ బుచ్, ఆమె భర్త ధవల్ బుచ్ తెలిపారు. ఈ ఆరోపణలన్నీ అవాస్తవమని కొట్టిపారేశారు. తన జీవితాల్లో ఎలాంటి రహస్యాలూ లేవని స్పష్టం చేశారు. అయితే, ఈ సారి హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదిక వీరిపై ఎలాంటి ప్రభావం చూపనుంది అనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.