బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్. ఉలవచారు ఆ రోజు చేసి తరువాత రోజు తింటే అధ్భుతంగా ఉంటుంది. ఐరన్ లోపం ఉన్నవాళ్లకి పర్ఫెక్ట్ జోడి. ఎలా చేస్తారో చూద్దాం.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : కొన్ని రుచులు ...కొన్నేళ్ల నుంచి అలా గుర్తుండిపోతాయి. అందులో ఉలవచారు ఒకటి. భోజన ప్రియులకు ఉలవచారు ప్రాణం . ఎలా చేసిన అధ్భుతంగా ఉంటుంది. ఉలవచారు ఎక్కువ వెల్లుల్లి ఫ్లేవర్ తో ఘాటు ఘాటుగా భలే ఉంటుంది. ఉడిపి– మంగుళూరు రీజియన్ లో ఈ రసం మనకు ఎక్కువగా కనిపిస్తుంది.
ఈ రసం చాలా స్పైసీగా ఉంటుంది. ఇందులో తాజా ఉలవలు మరియు వెల్లుల్లి పేస్ట్ ను వాడతారు. మీకు కనుక ఐరన్ లోపం ఉంటే ఉలవచారు తినడం చాలా మంచిది. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్. ఉలవచారు ఆ రోజు చేసి తరువాత రోజు తింటే అధ్భుతంగా ఉంటుంది. ఐరన్ లోపం ఉన్నవాళ్లకి పర్ఫెక్ట్ జోడి. ఎలా చేస్తారో చూద్దాం.
ఉలవచారును కేవలం నాలుగంటే నాలుగు సింపుల్ స్టెప్స్ లో తయారు చేసుకోవచ్చు.
* ఉలవలు ఫస్ట్ రాత్రే నానబెట్టుకొండి..మెత్తగా ఉడికి మంచి ఫ్లేవర్ దిగుతుంది.
* తెల్లారే ప్రెషర్ కుక్కర్ లో ఉలవలు మరియు నీరు పోసి నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు వాటిని ఉడికించాలి.
* ఒక గ్రైండర్ లో ఎండు కొబ్బరిని వేసి అందులో ఉల్లిగడ్డ మరియు మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఉలవలను అందులో వేసి గ్రైండ్ చేయాలి. ఈ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
ప్యాన్ లో ఆయిల్ వేడి అయిన తర్వాత ఆవాలు మరియు ఇంగువ వేయాలి. తర్వాత ప్యాన్ లో నీరు పోసి ఆ నీరు బాగా మరిగాక మీరు చేసుకున్న వెల్లుల్లి ...ఉలవల పేస్ట్ వేసుకొండి. ఇందులో కాసింత కారం , మరికొంత ధనియాల పొడి వేసుకొని ఉప్పు వేసుకొని ఇలా ప్యాన్ లో వేసిన అన్ని పదార్థాలు బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. బాగా మరిగాక మరో మారు కొత్తిమీర వేసి దించేసి తర్వాత రోజు తింటే సరి. అయితే ఇది కంప్లీట్ గా కర్ణాటక స్టైల్ లోనే . ఆంధ్రా స్టైల్ లో అయితే మరోలా చేస్తారు .