న్యూస్ లైన్ డెస్క్ : గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాలను తడిసి ముద్ద చేశాయి. ఇరు రాష్ట్రాలలోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఎక్కడిక్కడ వరద ప్రవాహం పెరగడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఏపీలోని ప్రకాశం బ్యారేజీకి భానరీ ఎత్తున వరద ప్రవాహం వచ్చి చేరింది.
గత 121 ఏళ్ల చరిత్రలో ఇంత భారీగా వరద నీరు ఎప్పుడూ రాలేదని ఏపీ సీఎంవో ట్వీట్ చేసింది. 1903లో, 2009లో అత్యధికంగా 10 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం దాటగా.. 2024లో ఏకంగా 11.36 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం దాటింది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలెవ్వరూ అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దని ప్రకటించింది.