హైదరాబాద్ కమిషనర్ కొత్తకోత శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహాంకాళి దేవాలయం, అక్కన్న మాదన్న దేవాలయాలను శుక్రవారం సందర్శించారు.
న్యూస్ లైన్ డెస్క్: హైదరాబాద్ కమిషనర్ కొత్తకోత శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహాంకాళి దేవాలయం, అక్కన్న మాదన్న దేవాలయాలను శుక్రవారం సందర్శించారు. బోనాల పండుగ సందర్బంగా చేస్తున్న బందోబస్తు, భద్రతా, ట్రాఫిక్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా కొత్తకోట శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ముందుగా భక్తులందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహాంకాళి దేవాలయములో బోనాల పండుగ సందర్భంగా ఆనవాయితిగా వస్తున్న ఆలయ శిఖర పూజా, ధ్వజారోహణ నిర్వహించి నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను అదృష్ట వంతుని గా భావిస్తున్నాను అని తెలిపారు.
లాల్ దర్వాజా అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని, రాష్ట్రం చాలా వేగంగా అభివృద్ది చెంది, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను అని తెలిపినారు. రాబోయే బోనాల పండుగ సందర్బంగా అంబారి ఊరేగింపుకు హైదారాబాదు సిటీ పోలీసు తరపున 1000 పోలీసు అధికారులు, సిబ్బందితో కట్టు దిట్టమైన భద్రత, బందోబస్తు ఏర్పాట్లు నిర్వహిస్తామని తెలిపారు. ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయముతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగ కుండా చూస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి స్నేహా మెహ్రా ఐపిఎస్, డిసిపి సౌత్ జోన్ ఆర్ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.