న్యూస్ లైన్ డెస్క్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన హైదరాబాద్ నగర ఎమ్మెల్యేల సమావేశానికి ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. రాష్ట్రంలో తాజా పరిణామాల నేపథ్యంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలతో పాటు కొత్తగా చేరిన ఎమ్మెల్యేలు, ప్రతిపక్షాల ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ మీద గుర్రుగా ఉన్నారట. అందుకే నగరంలోని ఎమ్మెల్యేలంతా సీఎం ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కాలేదని సమాచారం.
ముఖ్యమంత్రి మీటింగ్ కు నగర ఎమ్మెల్యేల డుమ్మా
బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు కూడా హాజరుకాకపోవడం ఆచ్చర్యం
తాజా పరిణామాల నేపత్యం లో సీఎం పై గుర్రుగా ఉన్నట్టు సమాచారం
బీజేపీ ఎంపీ మినహా సొంత పార్టీ నాయకులతోనే సమావేశం
గణేష్ ఉత్సవాల నిర్వహణపై సచివాలయంలో ముఖ్యమంత్రి… pic.twitter.com/IeaPuEETx0 — Telangana Awaaz (@telanganaawaaz) August 29, 2024
రాష్ట్రంలో గణేష్ ఉత్సవాల నిర్వహణపై సీఎం రేవంత్ సచివాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి నగరానికి చెందిన ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి పిలిస్తే ఎమ్మెల్యేలు రాకపోవడం పట్ల రాజకీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. కాగా సమీక్షా సమావేశానికి మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ, సీతక్క, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు, జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్, సీఎస్ శాంత కుమారి, డీజీపీ, ఇతర శాఖల ఉన్నతాధికారులు, గణేష్ ఉత్సవ సమితి అధికారులు మాత్రమే హాజరయ్యారు.