మన హిందూ సాంప్రదాయం ప్రకారం ధూప దీప నైవేద్యానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా మనం దేవాలయానికి వెళ్లి దీపారాధన చేస్తూ ఉంటాం. అలాంటి దీపాన్ని ఈ ఆకుపై భక్తి శ్రద్ధలతో పెడితే
న్యూస్ లైన్ డెస్క్:మన హిందూ సాంప్రదాయం ప్రకారం ధూప దీప నైవేద్యానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా మనం దేవాలయానికి వెళ్లి దీపారాధన చేస్తూ ఉంటాం. అలాంటి దీపాన్ని ఈ ఆకుపై భక్తి శ్రద్ధలతో పెడితే మనకు ఎంతటి కోరికైనా 41 రోజుల్లో తీరిపోతుంది. ఆ వివరాలు ఏంటో చూద్దాం. రావిచెట్టు అనేది శాపాలు, దోషాలు ఎన్నో విశిష్టతలను కలిగి ఉంటుంది. పూర్వజన్మ కర్మలని కూడా ఈ రావిచెట్టు తొలగించే శక్తి ఉంటుంది. అలాంటి రావి చెట్టు ఆకులపై మనం ఇంట్లో దీపం వెలిగిస్తే ఎలాంటి శాపం అయినా తొలగిపోతుందట.
రావి ఆకు తీసుకొని దానిపై ప్రమిదను ఉంచి అందులో నువ్వుల నూనె పోసి దీపం వెలిగిస్తే ఎలాంటి కోరిక అయినా దిగ్విజయంగా నెరవేరుతుందట. సర్ప దోషాలు, శనిగ్రహ దోషాలు రాహు, కేతు దోషాలు నవగ్రహ దోషాలు కూడా పోతాయట. సోమవారం జన్మించిన వారు రావి ఆకులు మూడు తీసుకొని నువ్వుల నూనె పోసి ప్రమిదలు పెట్టి దీపాలు వెలిగించాలట.
మంగళవారం జన్మించిన వారు ఆ రెండు ఆకులు తీసుకొని రెండు ప్రమిదలు పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలట. బుధవారం జన్మించిన వారు మూడు దీపాలు వెలిగించాలట. గురువారం జన్మించిన వారు ఐదు ఆకులు తీసుకొని ఐదు దీపాలు వెలిగించాలట. శుక్రవారం జన్మించిన వారు ఆరు ఆకులు తీసుకుని వాటిపై ప్రమిదలను పెట్టి నువ్వుల నూనె పోసి దీపాలు వెలిగించాలట.
శనివారం జన్మించిన వారైతే 9 దీపాలు వెలిగించాలట. ఇక ఆదివారం జన్మించిన జాతకులు అయితే 12 రావి ఆకులు తీసుకొని 12 ప్రమిదలు పెట్టి నువ్వుల నూనె పోసి దీపాలు వెలిగించి దేవుడికి సమర్పిస్తే ఎలాంటి కోరికలైనా 41 రోజుల్లో తప్పకుండా నెరవేరుతాయి. ఈ విధంగా చేస్తే దోషాలన్నీ తొలగిపోయి, శుభ ఫలితాలు కలుగుతాయి. శుక్రవారం పూట శ్రీ మహాలక్ష్మి దేవిని పూజించడం, ఆమె అనుగ్రహం పొందాలి అంటే తమలపాకుపై దీపాలు పెట్టి వెలిగిస్తే శుభప్రదం, ఆర్థిక ఇబ్బందులు అన్ని తొలగిపోయి ఆనందంగా జీవిస్తారని జ్యోతిష్య పండితులు అంటున్నారు.