కడుపు నొప్పి వస్తే హాస్పిటల్‌కు వెళ్లడానికి కూడా సరైన సదుపాయాలు లేవని విద్యార్థినులు చెబుతున్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని.. లేదంటే కలెక్టర్ వద్దకు వెళ్లి కంప్లైంట్ ఇస్తామని విద్యార్థినులు హెచ్చరించారు.
న్యూస్ లైన్ డెస్క్: ఒకేసారి 20 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని మోడల్ కాలేజీ హాస్టల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థినులకు తీవ్ర కడుపునొప్పి రావడంతో హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
తమకు పురుగులు ఉన్న అన్నం పెడుతున్నారని విద్యార్థినుల వాపోయారు. ఈ విషయాన్ని వార్డెన్ దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదని అన్నారు. దీని కారణంగా అస్వస్థతకు గురైనా పట్టించుకునే వారు లేరని, హాస్టల్‌లో నర్స్ కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కడుపు నొప్పి వస్తే హాస్పిటల్‌కు వెళ్లడానికి కూడా సరైన సదుపాయాలు లేవని విద్యార్థినులు చెబుతున్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని.. లేదంటే కలెక్టర్ వద్దకు వెళ్లి కంప్లైంట్ ఇస్తామని విద్యార్థినులు హెచ్చరించారు.