మనం మన ఆరోగ్యానికి చక్కగా ఆలోచించి వాడుకోవాలి అంతే. ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలను డైట్ లో భాగం చేసుకోవాలి.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ప్రతి కాలానికి ఓ డిఫరెంట్ ఫుడ్ ఉంటుంది. అవే సీజనల్ ఫుడ్స్ . అందుకే అంటారు...ఏ కాలాల్లో వచ్చే ఫుడ్స్ ఆ కాలాల్లో తినాలని . ప్రకృతి చాలా విలువైనది. మనం మన ఆరోగ్యానికి చక్కగా ఆలోచించి వాడుకోవాలి అంతే. ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలను డైట్ లో భాగం చేసుకోవాలి.
* సిట్రస్ ఫ్రూట్స్:
రోగనిరోధక శక్తి అనే మాట చెప్పగానే ఎవరికైనా సిట్రస్ ఫ్రూట్స్ గుర్తుకు వస్తాయి. ఉసిరి, జామ, నారింజ మొదలగు పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అందుకే ఈ కాలంలో ఉసిరి , ఆరెంజ్ లాంటివి సీజన్ చక్కగా తినండి.
*స్వీట్ పొటాటో:
స్వీట్ పొటాటోలో బీటా కెరాటిన్ అధికంగా ఉంటుంది. దీని కారణంగా శరీరానికి విటమిన్ ఏ అందుతుంది.
*పాలకూర:
పాలకూరలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్ సి ఉంటుంది. అంతేకాదు.. ఇందులో ఉండే ఫోలేట్.. రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాదు రక్తం తక్కువగా ఉన్న వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది.
* వెల్లుల్లి:
యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగిన అల్లిసిన్ అనే పదార్థం వెల్లుల్లిలో పుష్కలంగా దొరుకుతుంది.