Health: ఎక్కువగా చెమటలు వస్తున్నాయా అయితే ప్రమాదమే.?

ప్రస్తుత కాలంలో చాలామంది యువకులకే  అనేక రోగాలు వస్తున్నాయి. శరీరంలో ఏ చిన్న మార్పు వచ్చిన నమ్మడానికి లేదు. దీనికి ప్రధాన కారణం మనం తినే ఫుడ్, పెరిగే వాతావరణం. పూర్వకాలంలో హెల్తి ఫుడ్ తిని దానికి


Published Aug 10, 2024 12:12:26 AM
postImages/2024-08-10/1723262655_swet.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో చాలామంది యువకులకే  అనేక రోగాలు వస్తున్నాయి. శరీరంలో ఏ చిన్న మార్పు వచ్చిన నమ్మడానికి లేదు. దీనికి ప్రధాన కారణం మనం తినే ఫుడ్, పెరిగే వాతావరణం. పూర్వకాలంలో హెల్తి ఫుడ్ తిని దానికి తగ్గట్టుగా వర్క్ చేసేవారు. కానీ ప్రస్తుత కాలం  నాలుకకు తగ్గట్టు రుచితో ఫుడ్ తిని  దానికి తగ్గట్టుగా కష్టం చేయడం లేదు.

 దీంతో ఆ ఫుడ్ శక్తిని ఇవ్వడం కాదు కదా ఉన్న శక్తిని తీసేసి కొత్త రోగాలను తెచ్చిపెడుతోంది. ఈ మధ్యకాలంలో చిన్న నుంచి పెద్ద వరకు ఎక్కువగా ఇబ్బందులు పెట్టే వ్యాధి గుండెపోటు. అసలు దీనికి వయసుతో తేడా లేకుండా వస్తోంది. అలాంటి గుండెపోటు విషయంలో చాలామంది జాగ్రత్తగా ఉండాలని వైద్యులు అంటున్నారు. శరీరంలో ఏమైనా మార్పులు కనిపిస్తే వెంటనే డాక్టర్ కు చుయించుకోవాలని తెలియజేస్తున్నారు.

ముఖ్యంగా కొంతమందికి ఎలాంటి పని చేయకుండానే విపరీతమైనటువంటి చెమటలు వస్తూ ఉంటాయి. దీనికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఏదైనా శారీరక శ్రమ చేస్తే చెమట పట్టడం  కామన్. కానీ ఎలాంటి శ్రమ లేకుండా ఖాళీగా ఉన్న వాళ్లకు కూడా విపరీతంగా చెమటలు పడుతుంటాయి.  ఇలా చెమటలు పడితే అది ఒక పెద్ద వ్యాధికి సంకేతమట. దీనికి ప్రధాన కారణం హైపర్ హైడ్రోసిస్.

ఇలా చెమటలు పట్టడానికి ప్రధాన కారణం గుండె కవాటంలో వాపు, ఎముకలకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు, అలాగే హెచ్ఐవి ఇన్ఫెక్షన్లు వంటివి వస్తే చెమటలు ఎక్కువగా పడతాయట. ముఖ్యంగా చెమట పట్టడం అనేది గుండె జబ్బులకు కారణం కావచ్చని అంటున్నారు. ఇలా చెమటలు పట్టేవారు ఎక్కువగా ఆహారంపై శ్రద్ధ వహించాలి. ఉప్పు వాడకాన్ని తగ్గించాలి, మద్యపానాలను అవాయిడ్ చేయాలి. నీరు ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీరు కాస్త చెమట పట్టణం నుంచి ఉపశమనం పొందవచ్చు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu health-news health heart-problems hiv-aids swet

Related Articles