వారిపై కాంగ్రెస్ అల్లరి మూకలు దాడికి పాల్పడ్డాయి. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు BRS నేతలపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ BRS కార్యకర్త కాలు విరిగిపోగా.. పార్టీ నేతల కార్లు ధ్వంసం అయ్యాయి.
న్యూస్ లైన్ డెస్క్: ఖమ్మంలో పర్యటిస్తున్న తమపై జరిగిన దాడిలో పోలీసుల హస్తం కూడా ఉందని మాజీ మంత్రి, సూర్యాపేట BRS ఎమేల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఖమ్మంలోని ముంపుకు గురైన ప్రాంతాల్లో BRS మాజీ మంత్రులు హరీశ్ రావు, పువ్వాడ అజయ్, సబితారెడ్డి, జగదీశ్ రెడ్డి, మాజీ ఎంపీ నామా నాగేశ్వర రావు, వద్దిరాజు రవిచంద్ర తదితర బీఆర్ఎస్ నాయకులు పర్యటించారు.
అయితే, వారిపై కాంగ్రెస్ అల్లరి మూకలు దాడికి పాల్పడ్డాయి. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు BRS నేతలపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ BRS కార్యకర్త కాలు విరిగిపోగా.. పార్టీ నేతల కార్లు ధ్వంసం అయ్యాయి. తమ మీద జరిగిన దాడి ఘటనపై జగదీష్ రెడ్డి సంచలన విషయాలను బయట పెట్టారు. ఖమ్మం పోలీసులపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. మధ్యాహ్నం నుంచి అక్కడ పర్యటిస్తున్న తమ వద్దకు పోలీసులు రాలేదని ఆయన అన్నారు. పక్కా ప్లాన్ ప్రకారం ఖమ్మం పోలీసుల సహకారంతోనే BRS నాయకుల బృందం మీద దాడి జరిగిందని ఆయన అన్నారు.
కార్యకర్తల తలలు పగలగొట్టారని ఆయన అన్నారు. రెండు కార్ల అద్దాలను ధ్వంసం చేశారని వెల్లడించారు. కాంగ్రెస్ అల్లరి మూకలు, పోలీసులు కలిపి ఒకటేసారి వచ్చారు.. అప్పుడే మా మీద దాడి జరిగిందని వివరించారు. తిరిగి కాంగ్రెస్ అల్లరి మూకల మీద దాడి జరగకుండా పోలీసులు కాపాడారని ఆయన ఆరోపించారు. దాడికి బాధ్యలైన వారిపై చర్యలు తీసుకోవాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. తమపై జరిగిన దాడిలో పోలీసుల పాత్ర కూడా ఉందని ఆయన అన్నారు. దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. భయంతోనే కాంగ్రెస్ వాళ్లు పోలీసులను పంపించి తమపై దాడి చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఖమ్మంలో కాంగ్రెస్ నాయకుల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రులు, బీఆర్ఎస్ నేతల వాహనాలు.. https://t.co/ejVr1xcrge pic.twitter.com/sM2X0yKtC6 — News Line Telugu (@NewsLineTelugu) September 3, 2024