కరెంట్ అనగానే గుర్తొచ్చే మొదటి వ్యక్తి ఆయనే. అసలే కొత్తగా ఏర్పాటైన ప్రత్యేక రాష్ట్రం.. కేంద్రం నుండి వచ్చే నిధులు కూడా అంతంత మాత్రమే. అయినా సరే.. రైతులు సాగు చేసుకునేందుకు బోర్లు నడవాలంటే కరెంటు ఉండాలని 24 గంటల ఉచిత కరెంటు అందించడానికి ఆయన ఎంతో కృషి చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి తొలి విద్యాశాఖ మంత్రిగా గుంటకండ్ల జగదీష్ రెడ్డి వ్యవహరించారు. రెండు సార్లు సూర్యాపేట నియోజకవర్గం నుండి గెలుపొందడమే కాకుండా ఐదేళ్లు విద్యాశాఖ మంత్రిగా, మరో ఐదేళ్లు విద్యుత్ శాఖ మంత్రిగా వ్యవహరించారు.
అయితే, కరెంట్ అనగానే గుర్తొచ్చే మొదటి వ్యక్తి ఆయనే. అసలే కొత్తగా ఏర్పాటైన ప్రత్యేక రాష్ట్రం.. కేంద్రం నుండి వచ్చే నిధులు కూడా అంతంత మాత్రమే. అయినా సరే.. రైతులు సాగు చేసుకునేందుకు బోర్లు నడవాలంటే కరెంటు ఉండాలని 24 గంటల ఉచిత కరెంటు అందించడానికి ఆయన ఎంతో కృషి చేశారు. ఆయకట్టు రైతులకు ఉచితంగా సాగునీరు అందించేందుకు జగదీష్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. అంతేకాదు, నగరంలోనే కాకుండా పల్లెల్లో కూడా కోతలు లేని కరెంటు ఇచ్చేందుకు పాటు పడిన ఘటన ఆయనది.
తెలంగాణ వచ్చిన తర్వాత అంతరాయం లేని కరెంటు ఇచ్చేందుకు ఎంత కృషి చేశారో.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే, సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో.. తాను సభలో మాట్లాడుతున్న సమయంలో జగదీష్ రెడ్డి ఎక్కడున్నారో అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీనికి సమాధానంగా జగదీష్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
రేవంత్ రెడ్డి ఇక్కడ సభలో మాట్లాడుతున్నప్పుడు తాను కాంగ్రెస్ పాలకుల తుపాకి గుండ్లకు బలైన అమరవీరుల కోసం తిరుగుతున్నానని ఆయన గుర్తుచేశారు. కానీ, రేవంత్ రెడ్డి సంచులు మోసి ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లినప్పుడు తాను సభలోనే ఉన్నానంటూ జగదీష్ రెడ్డి ఘాటుగా స్పందించారు. రేవంత్ రెడ్డికి చర్లపల్లి జైలు జీవితం అలవాటు కాబట్టి పదే పదే గుర్తుచేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
తాజాగా, ఈ నేపథ్యంలోనే ఉద్యమంలో మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్‌తో పాటు ఉన్న జగదీష్ రెడ్డి ఫోటోలు కొన్ని బయటకు వచ్చాయి. ఉద్యమంలో ర్యాలీల నుండి.. రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినంత వరకు.. జగదీష్ రెడ్డి ప్రతి చోటా ఉన్నారు.