Jailer Villan: మలయాళ నటుడు వినాయకన్‌ అరెస్ట్

మలయాళ నటుడు వినాయకన్‌‌ను పోలీసులు అరెస్టు చేశారు.


Published Sep 07, 2024 08:22:34 PM
postImages/2024-09-07/1725720754_vinayakan.PNG

న్యూస్ లైన్ డెస్క్: మలయాళ నటుడు వినాయకన్‌‌ను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ అధికారులు వినాయకన్‌‌ను అదుపులో తీసుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో వినాయకన్‌ మద్యం మత్తులో సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ను కొట్టారు. కాగా, సీఐఎస్ఎఫ్‌ అధికారులు కానిస్టేబుల్‌పై దాడి చేశాడని ఫిర్యాదు చేశారు. దీంతో సీఐఎస్ఎఫ్‌ వినాయకన్‌ను అదుపులోకి తీసుకుని ఎయిర్‌పోర్ట్‌ పోలీసులకు అప్పగించారు. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్‌ నటించిన జైలర్‌ సినిమాలో వినాయకన్‌ వర్మ పాత్రతో పాపులర్‌ అయిన విషయం తెలిసిందే.

newsline-whatsapp-channel
Tags : india-people rajinikanth tollywood jail airport vinayaka-

Related Articles