IIT BABA: ఐఐటీ బాబాను అరెస్ట్ చేసిన పోలీసులు !

తాను అఘోరీనని పుట్టినరోజు సంధర్భంగా గంజా తీసుకున్నానని వివరణ ఇచ్చాడు. చాలా మంది సాధువులు ఆయన అఘోరీ కాదని చెప్పడం కూడా జరిగింది.


Published Mar 06, 2025 07:18:00 PM
postImages/2025-03-06/1741269131_IITBabaArrestGanja.jpg.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : మహాకుంభమేళాలో ఫేమస్ అయిన వారిలో ఐఐటీ బాబా కూడా ఒకరు. అయితే  రీసెంట్ గా ఐఐటీ బాబా జోస్యం కూడా చెప్పారు. ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ లో ఇండియా  ఓడిపోతుందని ...కట్ చేస్తే గెలిచింది. అంతేకాదు రీసెంట్ గా అఘోరీ బాబా ఓ హోటల్ లో గంజా కొడుతూ దొరికిపోయాడు. తాను అఘోరీనని పుట్టినరోజు సంధర్భంగా గంజా తీసుకున్నానని వివరణ ఇచ్చాడు. చాలా మంది సాధువులు ఆయన అఘోరీ కాదని చెప్పడం కూడా జరిగింది.


ఐఐటీ బాబా పేరు అభయ్ సింగ్‌‌పై జైపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన బసచేసిన హోటల్‌లో గొడవ జరుగుతోందని సమాచారం రావడంతో షిప్రాపథ్ స్టేషన్‌పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అయితే పోలీసులు అక్కడకి వెళ్లే సరికి మత్తులో ఊగుతూ కనిపించాడు. తనతోపాటు కొద్దిగా గంజా దొరకడంతో పోలీసులు నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకో ట్రోపిక్ సబ్ స్టాన్సెస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. చిన్న నేరమే కాబట్టి వార్నింగ్ ఇచ్చి బెయిల్ పై విడుదల చేశారు.


మరోవైపు పోలీసుల అరెస్టు తర్వాత తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ ఐఐటీ బాబా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే తను సూసైడ్ చేసుకుంటానన్న వార్త నిజం కాదని అతనే క్లారిటీ ఇచ్చాడు.  కుంభమేళాలో కనిపించిన దాదాపు ప్రతి బాబా గంజాయి ప్రసాదంగా తీసుకుంటారు. మరి వారందరినీ అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు ఐఐటీ బాబా. 


ఈ రోజు తన పుట్టిన రోజని, ఆనందంగా ఉండేందుకు గంజాయి సేవించినట్లు తెలిపారు. పైగా పోలీసుల విచారణలో కూడా ఐఐటీ బాబా తాను అఘోరి బాబానని, ఆచారం ప్రకారం గంజాయి సేవించినట్లు పేర్కొనడం విశేషం. ఐఐటీ బాబా ఒక హోటల్‌లో ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉందని తమకు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లామని పోలీసులు తెలిపారు. తాను గంజాయి తీసుకున్నట్టు చెప్పాడన్నారు. మరి కొంచెంది గంజాయి కూడా ఉందని.. స్పృహలో లేనప్పుడు తాను ఏదైనా చెప్పి ఉండవచ్చనని ఐఐటీ బాబా చెప్పాడని పోలీసులు తెలిపారు. ఎన్‌డీపీఎస్ చట్టం కింద గంజాయి కలిగి ఉండటం నేరం. అయితే తక్కువ మొత్తం కావడంతో ఇంటరాగేట్ చేసి బెయిల్ బాండ్‌పై విడుదల చేశామని పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో ఆయన ఏదో పోస్ట్ చేశారని, ఆయన సూసైట్ చేసుకోవాలనుకుంటున్నారని బాబా అనుచరులు మాకు సమాచారం ఇచ్చారు. అవసరమైతే ఆయనను పిలిపించి తదుపరి విచారణ జరుపుతాం" అని వెల్లడించారు. 


ఆయన అసలు పేరు అభయ్‌ సింగ్ గ్రేవార్‌. హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలోని ససరోలి గ్రామానికి అభయ్ తండ్రి న్యాయవాది. అభయ్ చాలా సంపన్న కుటుంబానికి చెందినవాడు. తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు. అభయ్ ఐఐటి బాంబేలో ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేశారు. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లోనే ఉద్యోగం వచ్చిన తర్వాత కొంతకాలం కార్పొరేట్‌లో పనిచేశారు. అనంతరం ఆ ఉద్యోగాన్ని వదిలేసి ఫొటోగ్రఫీపై మక్కువతో అటువైపు దృష్టి సారించారు.తర్వాత తన భక్తి మార్గంలో నడుస్తూ బాబా అయ్యాడు.అయితే అభయ్ పేరెంట్స్ మాట్లాడుతూ తన కుమారుడు చిన్నప్పటి నుంచి చదువుల్లో మంచి ర్యాంకులు సంపాదించేవాడని తెలిపారు ఆయన తండ్రి కరణ్ సింగ్. ఇంట్లో ఎప్పుడూ ఆధ్యాత్మికం గురుంచి మాట్లాడలేదని తెలిపారు. తాము గత ఆరు నెలలుగా కొడుకు కోసం వెతుకుతుండగా కుంభమేళాలో సాధువుగా కనిపించాడని తెలిపారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu drugs case mahakumbamela

Related Articles