బంగ్లాదేశ్‌లోని రాజకీయ పార్టీలకు కూడా ఇదే విషయాన్ని చెప్పామని జైశంకర్ అన్నారు. బంగ్లాదేశ్‌లోని పలు చోట్లలో మైనారిటీ వర్గాల ఆలయాలు, వ్యాపార కేంద్రాలపై కూడా దాడులు జరగడం ఆందోళనకరమని అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: బంగ్లాదేశ్ పరిస్థితులపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. మంగళవారం రాజ్యసభలో మాట్లాడిన అయన బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగానే బంగ్లాదేశ్ పరిణామాలపై ఇండియా వైఖరిని తెలిపారు. అక్కడ నెలకొన్న స్థిరత్వం లేని రాజీకయ పరిస్థితులను కూడా కేంద్ర ప్రభుత్వం గమనిస్తూనే ఉందని ఆయన అన్నారు.
భారత్- బంగ్లాదేశ్‌ల మధ్య దశాబ్దాలుగా మంచి సంబంధాలు ఉన్నాయని ఆయన అన్నారు. జనవరిలో ఎన్నికలు జరిగినప్పటి నుంచి బంగ్లా రాజకీయాల్లో ఉద్రిక్తతలు, విభజనవాదం నెలకొన్నాయని అన్నారు వెల్లడించారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని బంగ్లాదేశ్‌కు సూచించామని ఆయన తెలిపార. బంగ్లాదేశ్‌లోని రాజకీయ పార్టీలకు కూడా ఇదే విషయాన్ని చెప్పామని జైశంకర్ అన్నారు. బంగ్లాదేశ్‌లోని పలు చోట్లలో మైనారిటీ వర్గాల ఆలయాలు, వ్యాపార కేంద్రాలపై కూడా దాడులు జరగడం ఆందోళనకరమని అన్నారు.
బాంగ్లాదేశ్ ప్రధానిగా రాజీనామా చేసిన తరువాత ఇండియాకు వస్తానని షేక్ హసీనా కోరారని జైశంకర్ తెలిపారు. ఫ్లైట్ క్లియరెన్స్ కోసం బంగ్లాదేశ్ అధికారుల నుంచి వినతి వచ్చిందని తెలిపారు. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం ఆమె ఢిల్లీకి చేరుకున్నారని వెల్లడించారు.
బంగ్లాదేశ్‌లో 19 వేల మంది భారతీయులు ఉంటే.. వారిలో తొమ్మిది వేల మంది విద్యార్థులే అని ఆయన అన్నారు. అల్లర్ల నేపథ్యంలో ఇప్పటికే పెద్దమొత్తంలో విద్యార్థులు భారత్‌కు వచ్చేశారని ఆయన తెలిపారు. డిప్లొమాట్స్ ద్వారా అక్కడ ఉన్న భారతీయులతో టచ్‌లో ఉన్నామని.. మైనారిటీల పరిస్థితులను గమనిస్తున్నాని జైశంకర్ అన్నారు. భారత దౌత్య కార్యాలయాలకు అవసరమైన భద్రత కల్పించాలని ఆయన సూచించారు.