రాఖీ పండుగ నాడు తోడబుట్టిన వాళ్లకు రాఖీ కట్టేందుకు సెలవు కావాలన్నందుకు ఓ మహిళా ఉద్యోగిని జాబ్ లోంచి తొలగించారు. పంజాబ్ కు చెందిన ఓ ప్రైవేట్ కంపెనీ రాఖీ పండుకు సెలవు తీసుకుంటే ఏడు రోజులు జీతాన్ని కట్ చేయాలని కంపెనీ బాస్ హుకూం జారీచేశాడట.
న్యూస్ లైన్ డెస్క్ : రాఖీ పండుగ నాడు తోడబుట్టిన వాళ్లకు రాఖీ కట్టేందుకు సెలవు కావాలన్నందుకు ఓ మహిళా ఉద్యోగిని జాబ్ లోంచి తొలగించారు. పంజాబ్ కు చెందిన ఓ ప్రైవేట్ కంపెనీ రాఖీ పండుకు సెలవు తీసుకుంటే ఏడు రోజులు జీతాన్ని కట్ చేయాలని కంపెనీ బాస్ హుకూం జారీచేశాడట. అదే కంపెనీలో హెచ్ఆర్ విభాగంలో పనిచేస్తున్న మహిళ.. రాఖీ పండుగ రోజు సెలవు ఇవ్వాలి. ఒకవేళ సెలవు తీసుకుంటే వారం రోజుల జీతం ఎలా కట్ చేస్తారని ప్రశ్నించింది. కార్మిక చట్టాలను మీరు ఉల్లంఘిస్తున్నారంటూ కంపెనీ యజమానిని ప్రశ్నించింది. దీంతో.. ఆగ్రహించిన యజమాని ఆమెను ఉద్యోగంలోంచి తొలగిస్తున్నట్టు మెసేజ్ చేశాడు. రేపటి నుంచి ఆఫీసుకి రావొద్దు అంటూ వాట్సాప్ లోనే నోటీసులిచ్చారు. కనీసం నోటీస్ పీరియడ్ లేకుండా ఉద్యోగం నుంచి ఎలా తొలగిస్తారంటూ ఆమె లింక్డ్ ఇన్ లో పోస్ట్ చేసింది.
అయితే.. సోషల్ మీడియాలో ఆ పోస్టు వైరల్ గా మారడంతో కంపెనీ ప్లేటు ఫిరాయించింది. ఆమె వ్యక్తిగత కారణాలతో ఆఫీస్ టైమ్ వేస్ట్ చేస్తోంది. అందుకే ఆమెను పనిలోంచి తొలగించామని మార్చి చెప్తోంది. ఈ విషయాన్ని కూడా సదరు బాధితురాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మరోవైపు నెటిజనులు ఆమెకు మద్దతు పలుకుతున్నారు. లేబర్ కోర్టులో కేసు వేయమని, చట్టపరమైన నోటీసులు పంపమని, ఆ కంపెనీలో ఉద్యోగులందరూ ఒకేసారి రాజీనామా చేయాలని సూచించారు. మొత్తానికి రాఖీ పౌర్ణమి సమయంలో ఇలాంటి పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.