రాహుల్ గాంధీని కలిసి విజ్ఞాపన పత్రం ఇద్దామని వచ్చామని జర్నలిస్ట్ శంకర్ వెల్లడించారు. కానీ, అనుమతించకపోవడంతో రాహుల్ ఇంటి ముందు తమ సమస్యలపై నిరసన తెలిపారు.
న్యూస్ లైన్, ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇంటి ముందు తెలంగాణ జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. తెలంగాణలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులకు నిరసనగా సోమవారం ఉదయం జర్నలిస్టులు శంకర్, ప్రభాకర్, లింగస్వామి, ప్రవీణ్ ఢిల్లీలోని రాహుల్ గాంధీ ఇంటి ముందు, జంతర్ మంతర్ వద్ద ఆందోలన తెలిపారు. రాహుల్ గాంధీని కలిసి విజ్ఞాపన పత్రం ఇద్దామని వచ్చామని జర్నలిస్ట్ శంకర్ వెల్లడించారు. కానీ, అనుమతించకపోవడంతో రాహుల్ ఇంటి ముందు తమ సమస్యలపై నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జర్నలిస్ట్ ప్రభాకర్.. ఏ పార్టీకి మేము అనుకూలంగా లేమని అన్నారు. తాము ఏమైనా మిస్ లీడింగ్ వార్తలు రాసి ఉంటే.. కేసులు పెట్టొచ్చని చెబుతున్నారు. తమను టార్గెట్ చేస్తున్నారని వాపోయారు. కారు ఛేజింగ్ జరిగినప్పుడు నిమిషం, రెండు నిమిషాల వ్యవధిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డామన్నారు. సోషల్ మీడియాలో వాస్తవాలు చెప్పే తమపై డైరెక్ట్‌గా ఫిజికల్ ఎటాక్స్ చేస్తున్నారన్నారు. తమలాంటి చిన్న చిన్న వ్యవస్థలను తొక్కేయాలని భావించి భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ప్రభాకర్ అన్నారు.