సీబీఐ వేసిన కేసులో బెయిల్ కోసం ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం సుప్రీం కోర్టులో విచారణ జరిపారు. ఈరోజు సుప్రీంలో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి.
న్యూస్ లైన్ డెస్క్: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును సుప్రీం కోర్టు రిజర్వ్ చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన ఆయన.. గత కొంత కాలంగా తీహార్ జైల్లోనే ఉన్న విషయం తెలిసిందే. ఈడీ, సీబీఐ ఆయనపై కేసు నమోదు చేశాయి. అయితే, ఈ కేసులో బెయిల్ పొందేందుకు ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఈడీ వేసిన కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే.
సీబీఐ వేసిన కేసులో బెయిల్ కోసం ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం సుప్రీం కోర్టులో విచారణ జరిపారు. ఈరోజు సుప్రీంలో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. అయితే, ఇంకా వాదనలు వినిపించాల్సి ఉంటే లిఖిత పూర్వకంగా ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించినట్లు తెలుస్తోంది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేస్తున్నట్లు సుప్రీం తెలిపింది.