TEMPLE: ఉత్సవ విగ్రహానికే ప్రత్యేకపూజలు..జలదిగ్భంధంలో దేవాలయం !

వరద తీవ్రత తగ్గగానే యధావిధిగా మూల విరాట్ దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు.


Published Oct 24, 2024 10:11:00 PM
postImages/2024-10-24/1729788155_images.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మెదక్ జిల్లాలో మంజీరానది ఉద్ధృతికి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గ భవాని క్షేత్రం గత మూడు రోజులుగా జల దిగ్బంధంలోనే ఉంది. అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేకపూజలు చేస్తున్నారు. మూలవిఠాట్ ముందు భారీగా నీరు చేరడంతో ఉత్సవ విగ్రహాలకు పూజలు చేస్తున్నారు.భక్తులు కూడా ఆలయానికి వచ్చే అవకాశం లేకపోవడంతో తాత్కాలికంగా ప్రధాన ఆలయాన్ని మూసివేశారు.మంజీరా జలాలతో అభిషేకం, సహస్ర నామార్చన, కుంకుమార్చన, ప్రత్యేక పూజలు చేశారు. వరద తీవ్రత తగ్గగానే యధావిధిగా మూల విరాట్ దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు.


మంజీరా నది పరివాహక ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలని నీటి పారుదల శాఖ అధికారులు హెచ్చరించారు. గత సెప్టెంబర్​లో భారీ వర్షాలు కురిసిన సమయంలోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు మళ్లీ సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి విడుదలతో ఈ సమస్య ఎదురైంది. కాబట్టి రైతులతో పాటు భక్తులు కూడా దేవాలయ పరిసర ప్రాంతాల్లో రాకుండా ఉంటే మంచిదని అంటున్నారు ఆలయ అధికారులు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu water temple medak

Related Articles