కొంతమంది ప్రజలు మాత్రం శివ నివాసమైన శ్మశానంలో వేడుకలు జరుపుకుంటారు
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. నరకచతుర్ధశి నుంచి బాణాసంచా పేలుస్తూ చిన్నా పెద్ద సంబరాలు చేసుకుంటున్నారు. దేశ ప్రజలందరూ ఇళ్లలో దీపావళి చేసుకుంటారు. పూజలు చేస్తారు. లక్ష్మి దేవి కి పూజలు చేస్తారు. అయితే కొంతమంది ప్రజలు మాత్రం శివ నివాసమైన శ్మశానంలో వేడుకలు జరుపుకుంటారు.
కరీంనగర్‌లోని ఓ ప్రాంతవాసులు మాత్రం అందుకు భిన్నంగా పండుగ చేసుకుంటారు. అది వారి సంప్రదాయం కూడా. ఎన్నో యేళ్ల నుంచి దీపావళి వేడుకలు ఇలానే జరుపుకుంటున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ సాంప్రదాయం ఇక్కడే కాదు వారణాసిలో కూడా దీపావళి వేడుకలు చాలా చాలా బాగా చేస్తారు.
నగరంలోని కార్ఖానా గడ్డలో నివాసం ఉండే కొన్ని దళిత కుటుంబాలు ప్రతి సంవత్సరం శ్మశాన వాటికలో దీపావళి జరుపుకొంటాయి. తమ చనిపోయిన పెద్దలను గుర్తు చేసుకుంటూ సమాధుల మధ్య వారు ఈ పండుగను జరుపుకుంటారు. ఇందులో భాగంగా తొలత సమాధులను శుభ్రం చేసి పూలతో అలంకరిస్తారు. కుటుంబసభ్యులతో కలిసి సాయంత్రం శ్మశాన వాటికకు చేరుకొని టపాసులు కాల్చుకుంటారు. ఈ దళిత కుటుంబాలు ఈ సాంప్రదాయాన్ని ఇప్పటికి పాటిస్తున్నారు.