చేవెళ్ల ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాలే యాదయ్య కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే BRS పూర్తిగా కనుమరుగైపోతుందని ఇతర పార్టీలకు చెందిన నేతలు అంటున్నారు. తాజాగా ఈ అంశంపై కేసీఆర్ స్పందించారు.
న్యూస్ లైన్ డెస్క్: పార్టీని వీడి దొంగల్లో కలిసెటోళ్ల గురించి బాధ పడాల్సిన అవసరం లేదని మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్ అన్నారు. ఇటీవల BRSకు చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. మరోవైపు చేవెళ్ల ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాలే యాదయ్య కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే BRS పూర్తిగా కనుమరుగైపోతుందని ఇతర పార్టీలకు చెందిన నేతలు అంటున్నారు. తాజాగా ఈ అంశంపై కేసీఆర్ స్పందించారు.
శుక్రవారం కేసీఆర్‌ను కలిసేందుకు ఎర్రవెల్లికి వందలాది మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన ఆయన.. పార్టీని వీడి దొంగల్లో కలిసెటోళ్ల గురించి బాధలేదని అన్నారు. తెలంగాణ సాధించిన మనకు ఇదో లెక్కనా? అని ప్రశ్నించారు.
పార్టీనే నాయకులను తయారు చేస్తది తప్ప.. నాయకులు పార్టీని ప్రభావితం చేయలేరని వెల్లడించారు. నాడైనా, నెడైనా నాయకులను తయారు చేసుకున్నది పార్టీనే.. మెరికల్లాంటి యువ నాయకులను పార్టీ సృష్టిస్తది అని అన్నారు. రెట్టించిన ఉత్సాహంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దామని కేసీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.