ఈ అంశంపై విచారణ జరిపించేందుకు ప్రత్యేక కమిషన్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ కు జస్టిస్ నర్సింహారెడ్డి నేతృత్వంలో నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకే విచారణకు హాజరుకావాలని కోరుతూ కేసీఆర్ కు నోటీసులు కూడా పంపించారు. అయితే, జస్టిస్ నర్సింహా రెడ్డి విచారణలో ఏమాత్రం పారదర్శకత చూపించలేదని కేసీఆర్ ఆరోపించారు.
న్యూస్ లైన్ డెస్క్: మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్(KCR) రాష్ట్ర విద్యుత్ కమిషన్‌పై మంగళవారం హైకోర్టును ఆశ్రయించారు. BRS అధికారంలో ఉన్న సమయంలో కరెంట్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై విచారణ జరిపించేందుకు ప్రత్యేక కమిషన్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిషన్‌కు జస్టిస్ నర్సింహారెడ్డి(Narasimha reddy) నేతృత్వంలో నిర్వహించారు. ఈ మేరకే విచారణకు హాజరుకావాలని కోరుతూ కేసీఆర్‌కు నోటీసులు కూడా పంపించారు. అయితే, జస్టిస్ నర్సింహా రెడ్డి విచారణలో ఏమాత్రం పారదర్శకత చూపించలేదని కేసీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులకు అనుకూలంగా విచారణ జరిపించాలని నరసింహా రెడ్డి కమిషన్ ప్రయత్నిస్తోందని ఆయన వెల్లడించారు.
కేంద్ర, రాష్ట్ర అనుమతులు సాధిస్తూ ముందుకెళ్లామని వెల్లడించారు. ఈఆర్‌సీ(ERC) సంస్థలు వెలువరించిన తీర్పులపై కమిషన్లు వేయకూడదు. కమిషన్లు వేయకూడదన్న విషయం కూడా రేవంత్(Revanth) ప్రభుత్వానికి తెలియదా? అని కేసీఆర్ ప్రశ్నించారు. కమిషన్ చట్టవిరుద్ధమని ప్రభుత్వానికి సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం కూడా విరుద్ధమే అని తెలిపారు. రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని ఆరోపించారు. గతంలో అధికారంలో ఉన్న BRS ప్రభుత్వం గణనీయ మార్పుతో కరెంటు ఇచ్చిన విషయం అందరికీ తెలుసని వెల్లడించారు. మా మార్పును తక్కువ చేసి చూపించేందుకే ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.
పత్రికా విలేఖర్ల సమావేశంలో కూడా కమిషన్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడిందని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ అనేది ఒక పవిత్రమైన బాధ్యత అని.. రెండు పక్షాల మధ్య మధ్యవర్తిగా నిలిచి నిజాలను బయటపెట్టాలని సూచించారు. కమిషన్ తీరు చూస్తుంటే గత BRS ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నట్లే ఉందని తెలిపారు. ఇప్పటికే నష్టం జరిగినట్లు, ఆర్ధిక నష్టాన్ని లెక్కిస్తున్నట్లుగా కమిషన్ వ్యవహరిస్తోందని వెల్లడించారు. మీ విచారణలో నిష్పాక్షికత అనేదే కనిపించడం లేదని.. విచారణకు హాజరై, ఏం చెప్పినా ప్రయోజనం అయితే ఉండదని కేసీఆర్ తెలిపారు. చెప్పిన అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని కమిషన్ నుండి నరసింహారెడ్డి వైదొలిగితే మంచిదని కేసీఆర్ సూచించారు.
అయితే, కేసీఆర్ లేఖపై రాజకీయంగా తీవ్ర దుమారం రేగిందనే చెప్పుకోవచ్చు. మిషన్ నుండి నరసింహారెడ్డి వైదొలగాలన్న కేసీఆర్ అభిప్రాయంపై అధికార పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు కమిషన్ కు దీనిపై వ్యతిరేకత చూపించింది.
ఈ నేపథ్యంలోనే కేసీఆర్ తెలంగాణ విద్యుత్ కమిషన్‌పై కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని అందులో పేర్కొన్నారు. విద్యుత్ కమిషన్, జస్టిస్ నర్సింహారెడ్డి, ఎనర్జీ విభాగాలను ప్రతివాదులుగా చేర్చారు. నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు.