ఇలాంటి పరిణామాలు వైఎస్ హయాంలో ఎన్నో జరిగాయని, అయినా భయపడలేదని కేసీఆర్ గుర్తు చేశారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన BRSకు వచ్చే నష్టం ఏమీ లేదని తెలిపారు.
న్యూస్ లైన్ డెస్క్: పార్టీ మారుతున్న నేతల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యేలకు BRS అధినేత కేసీఆర్(KCR) సూచించారు. గత వారం రోజులుగా పార్టీలో నుండి పలువురు నేతలు వెళ్లిపోతున్న నేపథ్యంలో ఆయన BRS ఎమ్మెల్యే, పార్టీ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మంగళవారం ఎర్రవెల్లి(Erravalli)లోని నివాసంలో పలువురు BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు.
మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్ పార్టీ మారడాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేసీఆర్‌సూచించారు. ఇలాంటి పరిణామాలు వైఎస్ హయాంలో ఎన్నో జరిగాయని, అయినా భయపడలేదని కేసీఆర్ గుర్తు చేశారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన BRSకు వచ్చే నష్టం ఏమీ లేదని తెలిపారు.
ఈ క్రమంలోనే బుధవారం కూడా పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో కేసీఆర్ సమావేశం ఏర్పాటు చేశారు. హరీశ్ రావు, మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, సుధీర్ రెడ్డి, లక్ష్మారెడ్డిలు నేడు సమావేశానికి హాజరయ్యారు. పార్టీ మారుతున్న నేతల పట్ల తొందర పడి వ్యవహరించొద్దని కేసీఆర్ సూచించారు.