గత ఏడాది ఈ సమయం వరకు 99.89 లక్షల ఎకరాల్లో సాగు జరగగా.. ఈ ఏడాది 84.59 లక్షల ఎకరాలకు పడిపోయినట్లు తెలిపారు. దీంతో కొంతకాలం అయితే రాష్ట్రంలో పంట సాగు పూర్తిగా మూలనపడనుందా అనే పరిస్థితులు నెలకొన్నాయని నిపుణులు చెబుతున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నా.. ఇప్పటికీ ఒక్క విడత కూడా రైతుబంధు పడలేదు. దీంతో రైతులకు ఆర్ధిక సహాయం అందకుండా పోయింది. మరోవైపు రుణమాఫీ విషయంలో కూడా తీవ్రమైన గందరగోళం ఏర్పడింది. దీంతో తెలంగాణలో పంట విస్తీర్ణం గణనీయంగా తగ్గినట్లు తెలుస్తోంది. గతంతో పోలిస్తే.. 15.30 లక్షల ఎకరాల మేర సాగు తగ్గినట్లు వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు. పత్తి సాగు 2.67 లక్షల ఎకరాల్లో తగ్గినట్లు తెలిపారు. గత ఏడాది ఈ సమయం వరకు 99.89 లక్షల ఎకరాల్లో సాగు జరగగా.. ఈ ఏడాది 84.59 లక్షల ఎకరాలకు పడిపోయినట్లు తెలిపారు. దీంతో కొంతకాలం అయితే రాష్ట్రంలో పంట సాగు పూర్తిగా మూలనపడనుందా అనే పరిస్థితులు నెలకొన్నాయని నిపుణులు చెబుతున్నారు.
తాజగా, ఈ అంశంపై మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కేసీఆర్ పాలనలో సాగుకు స్వర్ణయుగం వస్తే, కాంగ్రెస్ రాగానే వ్యవసాయానికి గడ్డుకాలం వచ్చిందంటూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. కొత్త రుణాలు, విత్తనాలు, ఎరువుల కోసం రైతుల పడిగాపులు కాస్తున్నారని ఆయన వెల్లడించారు. ఏడాదిలో 15.30 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గిందని తెలిపారు. దేశానికే అన్నపూర్ణగా ఎదిగిన రాష్ట్రంలో 8 నెలల్లో ఎందుకింత విధ్వంసం అని ప్రశ్నించారు. గతంలో వ్యవసాయానికి సరిగా కరెంటు ఇవ్వలేదని.. ఇప్పుడేమో రుణమాఫీలో రైతుల సంఖ్యను తగ్గించారని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి మాటలు కోతలు దాటుతున్నాయి. కానీ, చేతలు మాత్రం చవలయం గేట్లు కూడా దాటడం లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రూ.500 బోనస్ అని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు నిలువునా మోసం చేసిందిని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు.. అన్నదాతలకు అత్యంత దయనీయ పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకునే విజన్ లేదు, రిజర్వాయర్లు నింపే ప్రణాళిక లేదు, చెరువులకు నీళ్లు మళ్లించే తెలివి లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో రైతు బతుకుకు భరోసానే లేదని విమర్శించారు. బురద రాజకీయాలు తప్ప సమయానికి సాగు నీళ్లిచ్చే సోయి లేదని విమర్శించారు. కొత్త రుణాల కోసం బ్యాంకుల వద్ద పగలూ రాత్రి తేడాలేకుండా ఎదురు చూడాల్సిన పరిస్థితి రైతులకు వచ్చిందని కేటీఆర్ వెల్లడించారు.