క సినిమా బాగోకపోతే సినిమాలు మానేస్తా...ఇది కిరణ్ అబ్బవరం డైలాగ్ . సినిమా మీద ఎంత నమ్మకం లేకపోతే అంత పెద్ద డైలాగ్ వేస్తాడు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : క సినిమా బాగోకపోతే సినిమాలు మానేస్తా...ఇది కిరణ్ అబ్బవరం డైలాగ్ . సినిమా మీద ఎంత నమ్మకం లేకపోతే అంత పెద్ద డైలాగ్ వేస్తాడు. అసలు ఎందుకు కిరణ్ అంత కన్ఫిడెంట్ గా ఉన్నాడో చూద్దాం.
అభినయ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) ఓ అనాథ. చిన్నప్పుడే ఓ అనాథాశ్రమం నుంచి డబ్బు దొంగతనం చేసి పారిపోతాడు. ఆ తర్వాత పెరిగి పెద్దయై పోస్ట్ మ్యాన్ చేరుతాడు. చిన్నప్పటి నుంచి లెటర్స్ చదివే అలవాటు ఉంటుంది. అలా చదివిన ఉత్తరాలతోనే కనెక్ట్ అయిపోయి.. ఊరంతా తనవాళ్లే అనుకుంటాడు. కృష్ణగిరిలో పోస్ట్ మాస్టర్ రంగారావు దగ్గర పనిలో చేరతాడు. అతడి కూతురు సత్యభామ తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఇటు లవ్ ట్రాక్ నడుస్తూ ఉంటుంది. ఇతలో రాధ అనే అమ్మాయిని ముసుగు వేసుకొని వ్యక్తి కిడ్నాప్ చేస్తాడు.
అదే సమయంలో ఊళ్ళో నుంచి కొందరు అమ్మాయిలు మాయమైపోతుంటారు. ఓ సారి సత్యభామను కూడా కిడ్నాప్ చేయాలని ప్రయత్నిస్తే అడ్డు పడతాడు వాసుదేవ్.అసలు ఎందుకు ఇలా జరుగుతుందని ఆరా తీస్తే అసలు విషయాలు బయటపడతాయి. చివరి 20 నిమిషాలు సినిమాకు ప్రాణం. దాని కోసం సినిమా అంతా చూడొచ్చు అంటే. స్క్రీన్ ప్లే మాత్రం నెక్స్ట్ లెవెల్. చాలా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే రాసుకున్నారు దర్శక ద్వయం సుజిత్-సందీప్. కాకపోతే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా క్లైమాక్స్ మీద ఉంది.
క్లైమాక్స్ కోసం చాలా వెయిట్ చేస్తుంటారు. మధ్యలో కాస్త స్లో అయిపోయింది. ఎలా అయినా సినిమా సూపరే. మీరు పెట్టే డబ్బలకి పైసా వసూల్ సినిమా.ఇంటర్వెల్ ట్విస్ట్ తో సకండ్ హాఫ్ కు గ్రాండ్ ఎంట్రీ లభిస్తుంది. చాలా కొత్త సినిమా . స్టోరీ మాత్రం చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. సస్పెన్స్ సినిమాలు మీకు ఇష్టం అనిపిస్తే మాత్రం ఈ సినిమా పర్ఫెక్ట్. కిరణ్ అబ్బవరం కు సూపర్ డూపర్ హిట్టు కొట్టాడు.